రాజేంద్రప్రసాద్ 'షష్టిపూర్తి'.. టీజర్ టాక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో నటించిన మూవీ షష్టిపూర్తి. పవన్ ప్రభా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రూపేష్ అక్షయ్ సింగ్ హీరోగా నటిస్తున్నారు.;
టాలీవుడ్ సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో నటించిన మూవీ షష్టిపూర్తి. పవన్ ప్రభా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రూపేష్ అక్షయ్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు. సీనియర్ నటి అర్చన మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే జోష్ తో మేకర్స్ ఇప్పుడు టీజర్ ను తీసుకొచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఇళయరాజాతో రిలీజ్ చేయించగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
మీ అమ్మనాన్నలకు బర్త్ డేలు, మ్యారేజ్ యానివర్సిరీలు జరిపించినా జరిపించకపోయినా.. షష్టిపూర్తి మాత్రం జరిపించండని చెబుతున్న బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అర్చన.. ఒకతను నన్ను ప్రేమిస్తున్నాడు అని తన ఫ్రెండ్స్ తో చెప్పగా.. వారు రాజేంద్రప్రసాద్ ను ఉద్దేశించి.. రేషన్ షాప్ లో పనిచేసే అబ్బాయా అని అడుగుతారు.
ఆ తర్వాత వారిద్దరికి పెళ్లి జరిగి బాబు పుడతాడు. అతడే హీరో.. కట్ చేస్తే లాయర్ గా మారుతారు. అనంతరం యాక్షన్ సీన్స్ చూపించారు. చివరలో ఒకప్పుడు నిన్ను చూసి పారిపోయిన వాళ్లు ఇప్పుడు నిన్ను పొగుడుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పిన డైలాగ్ తో టీజర్ ఎండ్ అయింది.
అయితే షష్టిపూర్తి టీజర్ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలుగుతనం ఉట్టి పడేలా ఉండే సినిమాను తీస్తున్నట్లు ఉన్నారని చెబుతున్నారు. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించేశారని చెబుతున్నారు. ఆయన లాస్ట్
డైలాగ్ మాత్రం సూపర్ అని కొనియాడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. MAA AAI ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఆయనే హీరోగా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ శ్రీను, చలాకీ చంటి, చక్రపాణి ఆనంద, అచ్యుత్ కుమార్, మురళీధర్ గౌడ్, అనిల్, జబర్దస్త్ రామ్, లత, శ్వేత తదితరులు నటిస్తున్నారు. కుటుంబ బంధాలు విలువలు నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం రిలీజ్ డేట్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.