ఇళ‌య‌రాజా సంగీత ద‌ర్శ‌కుడు ఎలా అయ్యారంటే?

సంగీత దిగ్గ‌జం ఇళ‌య‌రాజా ఔన్న‌త్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సంగీతంలో ఆయ‌నో లెజెండ్.;

Update: 2025-05-30 07:16 GMT

సంగీత దిగ్గ‌జం ఇళ‌య‌రాజా ఔన్న‌త్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సంగీతంలో ఆయ‌నో లెజెండ్. ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే చెర‌గ‌ని ముద్ర వేసారు. ఆయ‌నకంటూ కోట్లాది మంది అభిమానులున్నారు. ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇళ‌య రాజా ట్యూన్ అంటే ఆ సినిమాకే వ‌న్నే తెస్తుంది. పాట‌తోనే ఎన్నోహిట్లు అందించిన గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు.

దేశ విదేశాల్లో ఎన్నో క‌చేరీలు నిర్వ‌హించిన త‌న బ్రాండ్ ని విశ్వ‌వ్యాప్తం చేసారు. తాజాగా ఇళ‌య‌రాజా త‌న‌కు సంగీతం ఎలా అబ్బంది అన్న విష‌యాన్ని రివీల్ చేసారు. `నేనెక్క‌డో చిన్న గ్రామంలో పుట్టాను. అక్క‌డ సంగీతం నేర్పించే వారు కూడా ఉండ‌రు. చిన్నప్పుడు మా అన్న పాట‌లు పాడేవారు. ఆ పాట‌లు వింటూ నేను ఏదో ఒక‌టి వాయించే వాడిని. అలాంటి చోట నుంచి ఈ స్థాయికి వ‌చ్చాను.

అస‌లు నా నుంచి సంగీతం ఎలా వ‌చ్చిందో నాకే తెలియ‌దు. అన్న పాట‌ల‌కు నేను వాయిస్తే అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొట్టేవారు. కానీ ఆ చ‌ప్ప‌ట్లు నా గురించా? మా అన్న పాట గురించి? అన్న‌ది తెలియ‌లేదు . కొన్ని రోజుల‌కు నా సంగీతానికి తెలిసి గ‌ర్వ‌ప‌డ్డాను. అప్ప‌టి నుంచే సంగీతం కంపోజ్ చేయ‌డం ప్రారం భించాను. సంగీతంలో నాకు ఎలాంటి గురువు లేరు. నాకు నేను గురువును. చాలా మంది సంగీత ద‌ర్శ‌కుల‌కు గురువులు ఉంటారు.

వాళ్ల వ‌ద్ద శిష్య‌రికం చేసి సంగీత ద‌ర్శ‌కుడు అవుతుంటారు. కానీ సంగీతం అనే ప్ర‌యాణంలో నా జ‌ర్నీ మాత్రం పూర్తి విరుద్దంగా ఉంటుంది. మ‌నిషి మొద‌డు అన్న‌ది ల‌క్ష ఏఐల‌తో స‌మానం. ఏఐ ని క‌నిపెట్టిందే మ‌నిషి. మ‌నిషిని ఏ ఐ క‌నిపెట్ట‌లేదు. మానమ మొద‌డుకు సృష్టి అనేదే లేదు. కాబ‌ట్టి ఏఐతో భ‌యం అవ‌స రంలేద‌`న్నారు.

Tags:    

Similar News