'ఐకాన్' టైటిల్.. బన్నీకా? ఆ హీరోకా?

ఐకాన్ ప్రాజెక్ట్.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆ సినిమా కోసం జోరుగా చర్చ జరుగుతోంది.;

Update: 2025-07-03 08:30 GMT

ఐకాన్ ప్రాజెక్ట్.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆ సినిమా కోసం జోరుగా చర్చ జరుగుతోంది. కొంతకాలం క్రితం స్టార్ హీరో అల్లు అర్జున్ తో డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఆ మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నట్లు.. టైటిల్ పోస్టర్ ను కూడా అప్పట్లో మేకర్స్ రిలీజ్ చేశారు.

కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. పుష్ప సిరీస్ చిత్రాలతో అల్లు అర్జున్ ఐదేళ్లు బిజీ అయిపోయారు. అప్పుడే ఐకాన్ స్టార్ గా మారిన ఆయన.. పుష్ప-2 తర్వాత ఐకాన్ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ బన్నీ.. ఇప్పుడు అట్లీ మూవీ చేస్తున్నారు. దీంతో ఐకాన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకున్నారు. ఇంతలో దిల్ రాజు కీలక ప్రకటన చేశారు.

ఐకాన్ సినిమాను అల్లు అర్జున్ చేయరని.. మరో స్టార్ హీరోతో రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల వేణు శ్రీరామ్ కూడా అదే చెప్పారు. స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేశామని, ఓ హీరోతో దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అది స్టార్ హీరో విజయ్ దేవరకొండనేని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు టైటిల్ ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఐకాన్ టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ కొద్ది రోజుల నుంచి అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ కు కూడా టైటిల్ ను ఐకాన్ అని ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ప్రకటిస్తారని అంటున్నారు.

ఐకాన్ స్టార్ నటిస్తున్న మూవీకి ఐకాన్ అనే టైటిల్ పెర్ఫెక్ట్ గా సరిపోతుందని చెబుతున్నారు. కానీ అలా టైటిల్ పెట్టాలంటే వేణు శ్రీరామ్, దిల్ రాజును బన్నీ మూవీ మేకర్స్ సంప్రదించాలి. టైటిల్ కావాలని అడిగి తీసుకోవాలి. ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదని తెలుస్తోంది. దీంతో వేరే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో అల్లు అర్జున్ అడిగితే వేణు, దిల్ రాజు వెంటనే టిటిడి ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు వారు మరో టైటిల్ ను వెతుక్కోవాల్సి వస్తుంది. అయితే వేణు శ్రీరామ్ మాత్రం అందుకు రెడీగా లేరని సమాచారం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ టైటిల్ సినీ ఆడియన్స్ నోట్లో నానుతోంది. కాబట్టి తన మూవీకే పెట్టుకోవాలని అనుకుంటున్నారట. మరి ఐకాన్ టైటిల్ ఎవరు పెట్టుకుంటారో.. ఎవరు కొత్తది వెతుక్కుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News