హ్యాపీ బర్త్‌డే పోస్ట్ డిలీట్... ప్రేమ పుకార్లకు ఆజ్యం
ఇబ్రహీం అలీ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే పాలక్ తివారీని తమ ఫ్యామిలీ మెంబర్‌గా చేర్చుకున్నారని, అందుకే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సబా అలీ ఖాన్ పోస్ట్ చేసిందనే వారు చాలా మంది ఉన్నారు.;
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ, నటి పాలక్ తివారీ ప్రేమలో ఉన్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ప్రముఖ బుల్లి తెర నటి శ్వేతా తివారీ కుమార్తె అయిన పాలక్ తివారీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. సాధారణంగా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కలిసి నటించిన తర్వాత వారి ప్రేమ గురించి పుకార్లు షికార్లు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ పాలక్ తివారీ, ఇబ్రహీం అలీ ఖాన్ లు ఒక్క సినిమాలోనూ కలిసి నటించలేదు. కానీ వారి మధ్య ఉన్న స్నేహం, అది ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి బాలీవుడ్‌లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. పుకార్లు షికార్లు చేస్తున్న ఈ విషయం గురించి చర్చ మరింత పెరిగే విధంగా సైఫ్ అలీ ఖాన్ సోదరి సబా అలీ ఖాన్ పటౌడీ చేసింది.
హ్యాపీ బర్త్‌డే పాలక్ తివారీ
పాలక్ తివారీ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు, ఆమె అభిమానులు, మీడియా వారు వందల సంఖ్యలో, వేల కొద్ది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఎంతో మంది పాలక్ తివారీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే సబా అలీ ఖాన్ పటౌడీ పోస్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సబా అలీ ఖాన్ పోస్ట్ వెంటనే వైరల్ కావడంతో పాటు, రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. దాంతో సబా అలీ ఖాన్ తన పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం వెనుక కారణం ఏంటి, వెంటనే ఆ పోస్ట్‌ను ఆమె డిలీట్ చేయడంకు కారణం ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. ఆమె సన్నిహితులు మాత్రం దాటవేస్తూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇబ్రహీం అలీ ఖాన్ అత్త పోస్ట్
ఇబ్రహీం అలీ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే పాలక్ తివారీని తమ ఫ్యామిలీ మెంబర్‌గా చేర్చుకున్నారని, అందుకే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సబా అలీ ఖాన్ పోస్ట్ చేసిందనే వారు చాలా మంది ఉన్నారు. ఇబ్రహీం, పాలక్ తివారీ ప్రేమ వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చే విధంగా సబా అలీ ఖాన్ యొక్క పోస్ట్ పని చేసింది. అయితే సబా అలీ ఖాన్ పోస్ట్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది అనేది కొందరి అనుమానం. ఇబ్రహీం అలీ ఖాన్ ఫ్యామిలీలో అందరూ పాలక్ తివారీ విషయమై అనుకూలంగా లేకపోవడం వల్ల సబా అలీ ఖాన్ తన పోస్ట్‌ను డిలీట్ చేసి ఉండవచ్చు అనే అభిప్రాయంను సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆమె పెట్టిన బర్త్‌డే శుభాకాంక్షల పోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశం అయింది.
సబా అలీ ఖాన్ పోస్ట్ వైరల్
ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ వయసు 24 ఏళ్లు కాగా, పాలక్ తివారీ వయసు ఒక ఏడాది ఎక్కువ 25 ఏళ్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య వయసు ఒక్క ఏడాది తేడా ఉంది, అది కూడా ఆమె వయసు ఎక్కువగా ఉండటంతో కుటుంబంలో ఏమైనా విభేదాలు వచ్చి ఉంటాయేమో అనేది కొందరి అనుమానం. మొత్తానికి వీరిద్దరి గురించి ప్రస్తుతం ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ వార్తలు నిజమే అన్నట్లుగా ఇద్దరూ అప్పుడప్పుడు కలవడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో కావడం వంటివి చూస్తూ ఉంటే ప్రేమ చాలా దూరం వెళ్లినట్లుగా అనిపిస్తుంది అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు చాలా కామన్‌గా ఉంటాయి. అయితే ఈసారి కాస్త ఆసక్తికరంగా ఈ విషయం గురించి చర్చ జరగడంకు కారణం ఇద్దరూ స్టార్ కిడ్స్ కావడం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్టార్ కిడ్స్ లవ్ రూమర్స్ ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.