మాజీ భార్య తల్లి సంతాప సభలో స్టార్ హీరో హృదయం
హృతిక్- సుశానే జంట ఆఫ్టర్ బ్రేకప్ లైఫ్ చాలా మంది విడిపోయిన జంటలకు స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు. విడాకుల తర్వాతా ఆదర్శంగా ఎలా ఉండాలో ఈ జంట లోకానికి చాటి చెబుతోంది.;
బాలీవుడ్ బ్రేకప్ స్టోరీస్ లో హృతిక్ రోషన్- సుశానే ఖాన్ స్టోరి ఒకటి. ఆ ఇద్దరి మధ్యా మొదటి చూపు ప్రేమ.. పెద్దలను ఒప్పించి పెళ్లాడటం, ఆపై దాదాపు రెండు దశాబ్ధాల జీవన యానం, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా ఉండీ, చివరకు విషాదకరంగా విడాకులు తీసుకోవడం ప్రతిదీ ఒక కలలా సాగిపోయిన ఘటనలు. విడాకులు జీర్ణించుకోలేనిది. అయితే ఈ జంట విడిపోయాక కూడా ఒకరంటే ఒకరు గౌరవించుకోవడం, ప్రేమగా ఉండటం అనేది ఏ ఇతర బ్రేకప్ కపుల్ కి అయినా ఒక ఆదర్శం... ఒక స్ఫూర్తి. కలహాల కాపురం తర్వాత ఎడముఖం పెడముఖాలకు భిన్నమైన శైలి ఈ జంటది.
హృతిక్- సుశానే జంట ఆఫ్టర్ బ్రేకప్ లైఫ్ చాలా మంది విడిపోయిన జంటలకు స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు. విడాకుల తర్వాతా ఆదర్శంగా ఎలా ఉండాలో ఈ జంట లోకానికి చాటి చెబుతోంది. సుశానేకు ఏ కష్టం వచ్చినా తానున్నాను అంటూ ముందుకు వస్తాడు హృతిక్ రోషన్. తమ ఇద్దరు పిల్లలకు ఈ జంట ఎలాంటి లోటు లేకుండా పెంచుతున్నారు.
ఇప్పుడు మరో అరుదైన ఘట్టం. ఇటీవల సుశానే ఖాన్ తల్లి గారు, హృతిక్ అత్తగారైన జరీన్ ఖాన్ మృతి చెందారు. ఈ ఏడాది నవంబర్ 7న 81 సంవత్సరాల వయసులో జరీన్ తుది శ్వాస విడిచారు. ఆమె ప్రార్థనా సమావేశం నవంబర్ 10న జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో హృతిక్ రోషన్ ప్రథముడు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. జీతేంద్ర, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, ఫర్దీన్ ఖాన్ తదితరులు జరీన్ కు తుది నివాళులు అర్పించారు.
సంతాప సభలో సుస్సానే మాజీ భర్త హృతిక్ రోషన్ కూడా గౌరవ ప్రసంగం చేశారు. జరీన్ ఎంతో సౌకర్యమైన వ్యక్తి అని అన్నాఉడ. మిమ్మల్ని ప్రేమించడం నా అదృష్టం అని వ్యాఖ్యానించారు. హృతిక్ తో పాటు, అతడి ఇద్దరు కుమారులు హ్రేహాన్ రోషన్ , హ్రిధాన్ రోషన్ కూడా తమ అమ్మమ్మకు నివాళులు అర్పించడానికి కొన్ని మాటలు చెప్పారు.
జరీన్ ఖాన్ కుటుంబ సభ్యులు, ఆమె భర్త సంజయ్ ఖాన్, కుమారుడు జాయెద్ ఖాన్, కుమార్తెలు ఫరా ఖాన్ అలీ, సుస్సానే ఖాన్ ప్రార్థన సమావేశంలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ కూడా సంతాప సభలో పాల్గొన్నారు. తన జీవితానికి దిశా నిర్ధేశనం చేసిన తన తల్లి గొప్పతనం గురించి సుశానే ప్రశంసలు కురిపించారు.