పాట కోసం హీరోలిద్దరి మధ్య బిగ్ వార్!
`వార్ 2` చిత్రీకరణలో భాగంగా హృతిక్ రోషన్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య ఓ పాట చిత్రీకరణ జరుగుతోన్న సంగతి తెలిసిందే.;
`వార్ 2` చిత్రీకరణలో భాగంగా హృతిక్ రోషన్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య ఓ పాట చిత్రీకరణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముంబై యశ్ రాజ్ స్టూడియోస్ లో ఓ భారీ సెట్ నిర్మించి చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. పాటలో ఎన్టీఆర్-హృతిక్ పొటాపోటీగా డాన్సు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఈ పాట ఓ తగ్గాఫ్ వార్ లాగే ఉంటుందని సమాచారం. తాజాగా ఈ పాటకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.
ఈ పాటలో మొత్తం 500 మంది డాన్సర్లు పాల్గొంటున్నారుట. వాళ్లందరితో తారక్...హృతిక్ స్టెప్ అందుకుంటున్నారు. బాస్కో మార్టిస్ ఈ పాటకు కొరియోగ్రఫ వహిస్తున్నారు. సంగీత దర్శకుడు ప్రీతమ్ ఈ పాటకు అద్భుతంగా కంపోజ్ చేసినట్లు సమాచారం. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగ నిలుస్తుందని అంటు న్నారు. దాదాపు ఆరు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని చెబుతున్నారు.
అలాగే పాట కోసం భారీగానూ ఖర్చు అవుతున్నట్లు సమాచారం. మరి ఈ పాట ఆస్కార్ అవార్డు గెలుచు కున్న `నాటు నాటు` పాటకు పోటీగా ఉంటుందా? అంతకు మించి ఉంటుందా? అన్నది చూడాలి. ఎన్టీఆర్ -హృతిక్ కాంబినేషన్ లో పాట అనగానే నాటు నాటు పాటనే తలపించారు. ఇద్దరు పోటీ పోటీగా డాన్సు చేయడం ఖాయమని అప్పుడే డిసైడ్ అయింది. డాన్సులో ఎన్టీఆర్ మాస్టర్. టాలీవుడ్ లో మంచి డాన్సర్ గా తారక్ కి పేరుంది.
అలాగే బాలీవుడ్ లో టాప్ డాన్సర్ ఎవరు? అంటే హృతిక్ పేరు చెబుతారంతా. అలాంటి ఇద్దరు డాన్సింగ్ కింగ్స్ మధ్య పోటీ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నాటు నాటు ను మించే ఉంటుందని భావిస్తున్నారంతా. `వార్ 2` షూటింగ్ కూడా క్లైమాక్స్ కు చేరుకుంది. ఈనెలలో తారక్ పోర్షన్ మొత్తం ముగించుకుని ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు.