సంచనల బ్యానర్ లైనప్ మామూలుగా లేదే!
హృతిక్ ఇంత వరకూ బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో తప్ప ఇతర భాషల బ్యానర్లలో సినిమాలు చేయలేదు.;
శాండిల్ వుడ్ ...టాలీవుడ్ లో హోంబలే పిల్మ్స్ వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' నుంచి వెలుగులోకి వచ్చిన సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తోంది. ఒక్కో ప్రాజెక్ట్ కు వందల కోట్లు ఖర్చు చేస్తోంది. రాజీ లేని నిర్మాణంతో దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎదుగుతోంది. కొన్ని గంటల క్రితమే ఏకంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తోనే సినిమా ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది.
హృతిక్ ఇంత వరకూ బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో తప్ప ఇతర భాషల బ్యానర్లలో సినిమాలు చేయలేదు. అలాంటి స్టార్ హొంబలేకి డేట్లు ఇవ్వడంతో ఆ సంస్థ ప్రతిష్టత మరోసారి హైలైట్ అవుతుంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల వివరాలు ఇలా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానా యకుడిగా 'సలార్ 2' నిర్మించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం పట్టాలెక్కాల్సి ఉంది.
ఇదే సంస్థలో ప్రభాస్ కు మరో కమిట్ కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? అన్నది ఇంకా కన్పమ్ కాలేదు. కానీ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది. అలాగే తల అజిత్ తో కూడా ఇదే సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. అజిత్ తో భారీ సినిమా చేసేందుకు సమాయత్తం అవుతుంది. ఆ చిత్రం కూడా పాన్ ఇండియాలో ఉంటుందని సమాచారం. అలాగే రాకింగ్ స్టార్ యశ్ తో 'కే జీఎఫ్ 3' కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది.
కానీ అందుకు చాలా సమయం పడుతుంది. ఈ ప్రాంచైజీని తెరపైకి తెచ్చిన ప్రశాంత్ నీల్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. వాటి తర్వాతే 'కేజీఎఫ్ 3' మొదలవుతుంది. అలాగే టాలీవుడ్ సంచలనం ప్రశాంత్ వర్మ తో కూడా హోంబలే అగ్రిమెంట్ చేసుకుంది. ప్రశాంత్ తో భారీ పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం 'కాంతార' ఫేం రిషబ్ శెట్టితో 'కాంతార చాప్టర్ 1'ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఈసినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.