పెద్ది.. హోంబాలే ప్లాన్ ఏంటి?

టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యే టైమ్‌కి హోంబాలే రిలీజ్ అంటే జనాలకు నమ్మకం వస్తుంది. మంచి క్వాలిటీ, టైమ్‌కి రిలీజ్, ఎక్కువ థియేటర్లు ఉంటాయని గ్యారెంటీ.

Update: 2026-05-14 06:29 GMT

‘పెద్ది’ రిలీజ్‌కి ఎంతో టైమ్ లేదు. మరో రెండు వారాలలో ప్రీమియర్స్ హడావుడి బుకింగ్స్ మొదలవుతాయి. ఇక ఇప్పుడు హోంబాలే ఫిల్మ్స్ ఒక పెద్ద న్యూస్ తో హాట్ టాపిక్ గా మారింది. KGF, సలార్, కాంతారా తీసిన ఈ కంపెనీ, ఫస్ట్ టైమ్ విదేశాల్లో సినిమా రిలీజ్ చేసే పనిలోకి దిగింది. అది కూడా రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాతో. జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అమెరికా, గల్ఫ్, యూకే లాంటి చోట్ల హోంబాలేనే రిలీజ్ చేస్తోంది. అయితే ఇది చిన్న విషయం కాదు.

ఇప్పటిదాకా హోంబాలే పని సినిమా తీయడం వరకే. రిలీజ్ చేసే బాధ్యత వేరే వాళ్లకు ఇచ్చేవాళ్లు. కానీ ‘పెద్ది’తో వాళ్లే డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు. ఎందుకంటే చరణ్‌కు విదేశాల్లో ఫ్యాన్స్ చాలా ఎక్కువ. RRR తర్వాత ఆయన క్రేజ్ మామూలుగా లేదు. ఆ మార్కెట్‌ను వాడుకోవడంతో పాటు, హోంబాలే పేరును ఇంటర్నేషనల్‌గా బలంగా ఫిక్స్ చేయాలని వాళ్ల ప్లాన్ అని అర్ధమవుతుంది. ‘సలార్’ టైమ్‌లో ఓవర్సీస్‌లో రిలీజ్ లేట్ అవ్వడం, లెక్కలు తేడా రావడం వీళ్లు మర్చిపోలేదు.

‘పెద్ది’ మీద ఆల్రెడీ హైప్ ఉంది. బుచ్చి బాబు డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చరణ్ రగ్డ్ లుక్ అన్నీ కలిపి అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు హోంబాలే రావడంతో ఆ హైప్ డబుల్ అయ్యింది. ఎందుకంటే వీళ్ల దగ్గర సలర్ 2 లాంటి పెద్ద ప్రాజెక్టులు లైనప్ లో ఉన్నాయి. ‘పెద్ది’తో ఓవర్సీస్ మార్కెట్‌ను ఒకసారి సెట్ చేసుకుంటే, ఇక సొంత సినిమాలకు వేరే వాళ్ల మీద ఆధారపడక్కర్లేదు. ప్రతి టికెట్ డబ్బు మీద వీళ్లకే కంట్రోల్ ఉంటుంది.

సౌత్ నిర్మాతలకు ఇది కొత్తగా అనిపించే విషయం. మన వాళ్లు సొంతంగా విదేశాల్లో రిలీజ్ చేసుకుంటారు. కానీ ఒక కన్నడ బ్యానర్, తెలుగు హీరో సినిమాను వరల్డ్ వైడ్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. ఇక్కడ ‘పెద్ది’ కథ కంటే చరణ్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజ్‌ను హోంబాలే బాగా వాడుకుంటోంది. అదే వాళ్ల తెలివి. రిలీజ్‌కి రెండు వారాల ముందు ఈ న్యూస్ బయటకు రావడం కూడా కావాలనే.

టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యే టైమ్‌కి హోంబాలే రిలీజ్ అంటే జనాలకు నమ్మకం వస్తుంది. మంచి క్వాలిటీ, టైమ్‌కి రిలీజ్, ఎక్కువ థియేటర్లు ఉంటాయని గ్యారెంటీ. ‘పెద్ది’ హిట్ అయితే చరణ్‌కు స్ట్రాంగ్ కమ్‌బ్యాక్. ఒకవేళ తేడా కొట్టినా హోంబాలేకు మాత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ఫస్ట్ స్టెప్ పడ్డట్టే. జూన్ 4న సినిమా రిజల్ట్‌తో పాటు హోంబాలే కొత్త బిజినెస్‌కు కూడా అసలైన టెస్ట్.

కాబట్టి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సినిమా ప్రమోషన్ విషయంలో మేకర్స్ ఇప్పటికే కొన్ని ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు. ఓవర్సీస్ ఆడియెన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రచిస్తున్నారు. కంటెంట్ జనాల్లోకి మరింత లోతుగా వెళ్లేలా నెక్స్ట్ అప్డేట్స్ ఉండబోతున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. అలాగే మరో స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News