నాని ‘హిట్ 3’ టికెట్ హైక్స్.. కలిసొచ్చేనా?
ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నాని కెరీర్‌లో మరో హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.;
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ కొంత టెన్షన్‌లో ఉన్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నాని కెరీర్‌లో మరో హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.
సినిమా ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ యూత్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు బలం. టీమ్ చెబుతున్న సర్‌ప్రైజ్ క్యామియోలు, ఊహించని ట్విస్ట్‌లు సినిమాను మరింత ఎక్సైటింగ్‌గా మార్చనున్నాయి. గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త డల్‌గా ఉంది. ఈ సమయంలో ‘హిట్ 3’ రిలీజ్ కావడం థియేటర్లలో కొత్త జోష్ తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ‘హిట్ 3’ టికెట్ ధరల పెంపు కోసం జీవో జారీ అయింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఉత్తర్వులు ఆలస్యమయ్యాయి, కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి లభించింది. ఈ హైక్ మే 7 వరకు అమలులో ఉంటుంది. అయితే, స్పెషల్ షోలు లేదా రాత్రి ప్రీమియర్ షోల గురించి జీవోలో సమాచారం లేకపోవడంతో అవి ఉండకపోవచ్చు.
ఈ టికెట్ ధరల పెంపు నాని సినిమాకు ఇదే తొలిసారి, ఇది బిజినెస్‌కు బూస్ట్ ఇవ్వనుంది. ఈ హైక్‌తో నానికి అవకాశం, రిస్క్ రెండూ ఉన్నాయి. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ధరలతో సంబంధం లేకుండా థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయి. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ధరల కారణంగా కాస్త దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే, యూత్, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.
నాని కాన్ఫిడెన్స్ చూస్తే, సినిమా కంటెంట్‌పై అతనికి ఫుల్ నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీలో బుకింగ్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. చాలా సెంటర్లలో టికెట్లు ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. ఏపీలో ఉదయం 7 గంటల నుంచే షోలు మొదలవుతుండగా, తెలంగాణ కంటే ముందే షోలు స్టార్ట్ అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే, సినిమా ఓపెనింగ్స్ బాగుంటాయని స్పష్టమవుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే రూ.2.48 కోట్ల గ్రాస్ నమోదైంది. ఏపీ కూడా జోరు చూపిస్తే, మొదటి రోజు కలెక్షన్స్ రూ.5 కోట్ల మార్క్‌ను తాకొచ్చు.