సినిమానే కాదు.. ప్రమోషన్స్ కూడా వయొలెంటే..

ప్రమోషన్స్.. ఇది ఏ సినిమాకు అయిన ముఖ్యమే. షూటింగ్ ఎంత కష్టపడి చేసినా.. ప్రమోషన్స్ తో కచ్చితంగా మూవీపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయాల్సిందే.;

Update: 2025-04-20 05:42 GMT

ప్రమోషన్స్.. ఇది ఏ సినిమాకు అయిన ముఖ్యమే. షూటింగ్ ఎంత కష్టపడి చేసినా.. ప్రమోషన్స్ తో కచ్చితంగా మూవీపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయాల్సిందే. అప్పుడే సినిమా అందరిలో పాతుకుపోతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దీంతో ప్రమోట్ చేసే విషయంలో మేకర్స్ ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారని చెప్పాలి.

కొత్త కొత్తగా ఆలోచిస్తూ మూవీని ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు హిట్-3 విషయంలో కూడా అదే జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో రూపొందిన ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వయొలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న మూవీపై ఇప్పటికే వేరే లెవెల్ అంచనాలు నెలకొన్నాయి.

మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ చూస్తుంటే సినిమాలో వయొలెన్స్ మామూలుగా లేదని క్లియర్ గా తెలుస్తోంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాని కూడా చెప్పకనే చెప్పేశారు. కాబట్టి ది మోస్ట్ వయొలెంట్ గా రానున్న హిట్-3 మూవీ ప్రమోషన్స్ ను కూడా వయొలెంట్ గానే చేస్తున్నారు మేకర్స్.

అందుకు గాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్డూడియోలో స్పెషల్ సెట్ వేయించారు. ఓ.. సెట్టే కదా అనుకుంటే పొరపాటే.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారే విధంగా సెట్ ఏర్పాటు చేశారు. సినిమాలో ఎంత వయొలెన్స్ ఉందో.. ఆ సెట్ లోనే చూపించేశారు. మూవీ షూటింగ్ లో వాడిన కత్తులు, ఆయుధాలు, తుపాకీలు, బుల్లెట్లు, పోలీస్ లాకప్.. అలా అన్నీ సెట్ లో ఏర్పాటు చేశారు.

జైలు గదులు, పోలీస్ ఇంటరాగేషన్ రూమ్ల.. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ సెట్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు అంతా షాకైపోతున్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడిందో తెలుస్తోందని అంటున్నారు. ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు.

అయితే ఆ సెట్ కు వెళ్లి హిట్-3 టీమ్ తో మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు ఇంటర్వ్యూలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాళ్లు కూర్చునేందుకు సిద్ధం చేసిన కుర్చీలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి హిట్-3 ప్రమోషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి మే 1వ తేదీన విడుదల కానున్న సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News