• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ దెబ్బకు నాగశౌర్య బిగ్...

ఆ దెబ్బకు నాగశౌర్య బిగ్ కన్ఫ్యూజన్..

| గట్టి హిట్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నారు

By - Tupaki Desk
Update: 2023-08-04 15:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు. అయితే అందులో సక్సెస్ అందుకుంటున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది యంగ్ హీరోస్ కు అస్సలు కలిసి రావట్లేదు. సరైన భారీ హిట్ దక్కట్లేదు. అలాంటి వారిలో లవర్ బాయ్ నాగ శౌర్య ఒకరు. గట్టి హిట్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నారు.

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగశౌర్య... ఆ తర్వాత 'ఛలో'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ హిట్ అందుకుని దాదాపు ఐదేళ్లు అవుతుంది. కానీ ఇంతవరకు మళ్లీ సక్సెస్ ను చూడలేదు ఆయన. 'అశ్వద్ధామ', 'లక్ష్య' అంటూ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏదీ వర్కౌట్ అవ్వట్లేదు. రీసెంట్ గా 'రంగబలి' సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.

ఈ సినిమాతో నాగశౌర్య ఎలాగైనా గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని సినీ ప్రియులు ఆశించారు. నాగశౌర్య కూడా అదే కాన్ఫిడెన్స్ తో కనిపించారు. ప్రమోషన్స్ లో సినిమా హిట్ పక్కా అన్న ధీమాతోనే కనిపించారు. కానీ ఇది కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. నాగశౌర్య అంచనాలను తారుమారు చేసింది. ఆయన కెరీర్ ను సందిగ్ధంలో పడేసింది.

ఫలితంగా తర్వాత ఎలాంటి కథతో రావాలో తెలీయక ఆయన సతమతమవుతున్నారని తెలిసింది. సైలైంట్ అయిపోయారట. ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా ఆయన సైన్ చేయలేదని తెలిసింది. ఎలాంటి కథతో వస్తే.. ఆడియెన్స్ ఆదరిస్తారా అనే ఆలోచనలో పడ్డారట. ఎలాగైనా ఈ సారి పక్కా స్క్రిప్ట్ తో సినీ ప్రియులను మెప్పించేలా రావాలని పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. కానీ ఎలాంటి సినిమాతో ముందుకు రావాలో తెలీక కాస్త కన్ఫూజన్ లోనూ పడ్డారని టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా ఓ హీరో చేసే సినిమాలు వరుసగా ఫ్లాప్ లు అయితే.. ఆయన చేయబోయే కొత్త సినిమాలపై రోజు రోజుకీ అంచనాలు తగ్గుతుంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నాగశౌర్య చేయబోయే కొత్త సినిమాపై ఆయన కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఆయన ఈ సారి ఎంతో ఆచితూచి రావాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    
  • Nagashaurya 
  • Chalofilm 
  • Lakshyafilm 
  • Rangabalimovie 
  • Heronagashaurya 
  • Tollywood 

Similar News

గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!

2026-11-18 07:46 GMT

నిజ జీవితంలోనూ గ్రేట్.. మనవళ్లతో గ్రీస్ వెకేషన్‌లో తలైవా!

2026-11-18 07:46 GMT

గ్రీస్ వెకేషన్‌లో స్టార్‌క‌పుల్ రొమాన్స్.. వ‌య‌సు ఒక అంకె మాత్ర‌మే!

2026-11-18 07:46 GMT

స్కూల్‌లో మొదలైన పరిచయం... తన భార్య అమల్‌తో లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్!

2026-11-18 07:24 GMT

'మైసా' కోసం రణబాలి రానున్నాడా?

2026-11-18 07:14 GMT

కొత్త జేమ్స్ బాండ్ సినిమాలో విలన్‌గా బ్రాడ్ పిట్?

2026-11-18 07:13 GMT

విమర్శలను సైతం అవకాశాలుగా మ‌లుచుకుంటోన్న న‌యా స్టార్!

2026-11-18 07:12 GMT

సక్సెస్ వచ్చినా? కష్టం వచ్చినా? వారే దిక్కు!

2026-11-18 07:09 GMT

అత్తగారింట్లో సమంత సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్!

2026-11-18 07:08 GMT

గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన సాత్విక వీరవల్లి..ఈ క్రేజ్ ఏంటి తల్లీ!

2026-11-18 07:08 GMT

నలుగురు స్టార్ హీరోలు.. ఆదిత్య ధర్ గురి పెద్దదే!

2026-11-18 07:07 GMT

హీరోలు మారుతున్నారు.. కానీ దర్శకులే..

2026-11-18 05:48 GMT

Copyright @2026

Powered by Blink CMS