త్రివిక్రమ్ - పూరి.. వంగా రేంజ్ లో వాడుకుంటారా?
టాలీవుడ్ ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తుండగా.. ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వెంకీతో మాటల మాంత్రికుడు చేతులు కలపగా.. తొలిసారి డైరెక్టర్ గా ఆయనతో వర్క్ చేస్తున్నారు.
అదే సమయంలో పూరి జగన్నాథ్.. ఇప్పుడు కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ సేతుపతితో పని చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు మూవీ రానుండగా.. మేకర్స్ అనుకున్నట్లే షెడ్యూల్స్ ను పూర్తి చేస్తున్నారు. అయితే ఆ రెండు సినిమాలకు ఒకరే మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుండటం గమనార్హం.
హర్షవర్ధన్ రామేశ్వర్ అటు త్రివిక్రమ్- వెంకీ మూవీకి.. ఇటు పూరి- సేతుపతి సినిమాకు మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అయితే హర్షవర్ధన్.. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నిర్మించిన యానిమల్ మూవీతోనే మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన ప్రముఖ రాధన్ వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేశారు.
ఆ సమయంలో సందీప్ రెడ్డి వంగా.. హర్షవర్ధన్ ను అర్జున్ రెడ్డి మూవీకి గాను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వివిధ సినిమాలకు వర్క్ చేసిన ఆయన.. సందీప్ తీసిన యానిమల్ మూవీకి కూడా పని చేశారు. అందుకుగాను ప్రముఖ జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నారు.
ఇప్పుడు మళ్లీ సందీప్ వంగా- ప్రభాస్ కాంబినేషన్ లో రానున్న స్పిరిట్ మూవీకి వర్క్ చేస్తున్నారు. అలా టాలీవుడ్ లో మూడు బడా ప్రాజెక్టులకు పని చేస్తున్న హర్షవర్ధన్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ తోపాటు దేవి శ్రీ ప్రసాద్ కు పోటీ ఇచ్చేలా ఉన్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో మరో విషయంపై కూడా చర్చిస్తున్నారు.
అదేంటంటే.. హర్షవర్ధన్ ఇప్పటి వరకు అనేక సినిమాలకు పని చేసినా.. వంగా మూవీస్ కు మాత్రమే మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మిగతా సినిమాలకు సోసోగానే అందించారు. సాంగ్స్ విషయానికొస్తే.. చాలా తక్కువ కంపోజ్ చేశారు. యానిమాల్ లో (పాపా మేరీ జాన్) ఒక్కటే స్వరపరిచారు. అర్జున్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
అయితే పూరి, త్రివిక్రమ్ మ్యూజిక్ పరంగా తమ సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అదిరిపోయే సాంగ్స్ ఉండాలని చూసుకుంటారు. మ్యూజిక్ లవర్స్ ను మెప్పించాలని అనుకుంటారు. కచ్చితంగా మ్యూజిక్ పై బాగా శ్రద్ధ వహిస్తారనే చెప్పాలి. మరి వాళ్లకు హర్షవర్ధన్ రామేశ్వర్ ఎలాంటి అవుట్ పుట్ ఇస్తారో వేచి చూడాలి.