హరీష్ శంకర్.. ఇది గిఫ్ట్ షాప్‌లోనిది కాదు.. హృదయంతో చేసినది!
అలాంటి చక్కదనం ఉన్న ఒక బహుమతిని అందుకున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ లో బిజీగా ఉన్న హరీష్ శరవేగంగా చిత్రీరణను పూర్తి చేస్తున్నారు.;
కొన్ని బహుమతులు ఖరీదు మ్యాటర్ కాదు.. వాటి ప్రత్యేకతను చిరస్థాయిగా నిలుపుకునేంత చక్కదనంతో ఆకర్షిస్తాయి. అలాంటి చక్కదనం ఉన్న ఒక బహుమతిని అందుకున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ లో బిజీగా ఉన్న హరీష్ శరవేగంగా చిత్రీరణను పూర్తి చేస్తున్నారు.
ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మేటి నటుడు, దర్శకనిర్మాత పార్థిబన్ నుంచి హృదయాన్ని తాకే కానుకను అందుకున్నాడు. ఆ క్షణం తన జీవితంలో మర్చిపోలేనిదని హరీష్ భావిస్తున్నాడు. ఒక గొప్ప ఫిలింమేకర్ నుంచి తాను కానక అందుకోవడాన్ని గర్వించదగిన క్షణం అని అన్నాడు హరీష్. పార్తిబన్ తన ప్రేమను, గౌరవాన్ని, హృదయాన్ని ఈ ఒక్క కానుకలో ఆవిష్కరించారు. అందుకే ఇది హరీష్ ని అంతగా ఎమోషనల్ అయ్యేలా చేసింది.
అందరూ ఒకేలా ఉండరు. కొందరు మాత్రమే ప్రత్యేకంగా తమ జీవిత గమనాన్ని సాగిస్తారు. ఎప్పటికీ మనసుల్లో నిలిచిపోతారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వంతో పార్థిబన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నారు. అతడు హరీష్ శంకర్ కి ఇచ్చిన కానుక చాలా ప్రత్యేకమైనది. ఇది గిఫ్ట్ ఆర్టికల్ షోరూమ్ నుంచి కొన్నిది కాదు. కస్టమ్-మేడ్ ఫిల్మ్ ప్రొజెక్టర్ మోడల్. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సింపుల్‌గా హరీష్ కి దీనిని అందించాడు. వారి మధ్య ప్రేమ ఆప్యాయత గౌరవం వంటివి అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఈ బహుమతి చాలా అందంగా ఉంది. యాక్రిలిక్ బాడీ.. చక్కని చిన్న రీల్స్.. ఫంక్షనల్‌గా కనిపించే లోహపు ముక్కలు. ఇలాంటివి హృదయంతో మాత్రమే తయారవుతాయి. పార్థిబన్ ఈ బహుమతిపై ఒక చక్కని సందేశాన్ని కూడా రాసారు. ఇది కేవలం కృతజ్ఞత కోసం ఇచ్చే బహుమతి కాదు. ఒక క్రియేటర్ ఇంకో క్రియేటర్ కి ఇచ్చే గౌరవం ప్రేమ ఆప్యాయతలకు సంబంధించినది. ఇది నిశ్శబ్ద వందనం. హరీష్ ఎంతో ఆనందంగా ఈ బహుమతిని అభిమానులకు ప్రదర్శించాడు. పార్థిబన్ కి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, హరీష్ కాస్త ఆలస్యమైనా కానీ, ప్రాజెక్ట్ విజయంపై ధీమాగా ఉన్నట్టు అర్థమవుతోంది.