• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరిహర వీరమల్లు.. మరో...

హరిహర వీరమల్లు.. మరో అప్డేట్ తో ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత

| క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-27 05:24 GMT

పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' కూడా ఒకటి. పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేశారు. దీని తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి థియేటర్స్ లో విడుదలయ్యాయి కానీ హరిహర వీరమల్లు మాత్రం షూటింగ్ దశలోనే ఉండిపోయింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సుమారు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదనే ఉంది. ఈమధ్య ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే న్యూస్ కూడా వైరల్ అయింది. ఆ తర్వాత దర్శకుడిగా క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ప్రచారం కూడా జరిగింది. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయం తెలియదు కానీ హరిహర వీరమల్లు సినిమా గురించి నిర్మాత ఏం రత్నం తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం సినిమా ఆగిపోలేదని అర్థమవుతుంది. దానికి తోడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ.." పవన్ కళ్యాణ్ తో ఏదో ఒక సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవాలంటే ఓ 20 రోజులు ఆయన డేట్స్ ఎలాగోలా తీసుకుని సినిమా చేసే వాడిని. కానీ ఆయనతో చేసే సినిమా ఎప్పటికి గుర్తుండిపోవాలి.

ఇండియా లెవెల్ లో ఆయన ఏంటో తెలియాలి అనే స్థాయిలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాం. వైసీపీ మీడియా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేస్తోంది. కానీ అందులో వాస్తవం లేదు. హరిహర వీరమల్లు సినిమాకి రెండు భాగాలుగా ఉంటుంది" అంటూ ఏంఎమ్ రత్నం చెప్పుకొచ్చారు. సినిమా ఆగిపోలేదని రెండో భాగం కూడా ఉంటుందని నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి ఫుల్ ఖుషి అవుతున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ మూవీ ఇది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీలకు సంబంధించిన కథాంశంతో 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Krish 
  • Pawankalyan 
  • Powerstar 
  • Hariharaveeramallu 
  • Movie 
  • Hhvmmovie 
  • Amratnam 
  • Movieupdates 
  • Ysrcpmedia 
  • Fakenews 
  • Filmindustry 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS