అలా అయితే పవన్‌తో రౌడీ పోటీపడాల్సిందే?
టాలీవుడ్ నుంచి త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, కింగ్ డమ్.;
టాలీవుడ్ నుంచి త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, కింగ్ డమ్. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న `హరి హర వీరమల్లు` ఆయన నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ, అలాగే పవన్ నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిల్మ్. ఈ మూవీ గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జనవరి 14, 2022న ముందు ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది కుదరలేదు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ నిరవదికంగా వాయిదా పడుతూ వస్తోంది. జూన్ 12న ఫైనల్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది కూడా వాయిదాపడింది. ఇప్పుడు కొత్త డేట్ వినిపిస్తోంది. ఈ మూవీని జూలై 18న రిలజ్ చేస్తారని, లేదా జూలై 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక ఇదే తరహాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ `కింగ్‌డమ్` వరుసగా వాయిదాపడుతూ వస్తోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై విజయ్ దేవరకొండ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. `లైగర్` ఫ్లాపుతో కొత నిరాశకు గురైనా ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వరుసగా పోస్ట్ పోన్ అవుతూ అందిరిని షాక్‌కు గురి చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ మూవీని జూలై 25న మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. `హరి హర వీరమల్లు` జూలై 18న వస్తే ఓకే కానీ అదే జూలై 25న థియేటర్లలోకి వస్తేనే అసలు సమస్య మొదలవుతుందని, అది `కింగ్‌డమ్`కు తీవ్ర ఇబ్బందిని కలిగించి వసూళ్లపై ప్రభావాన్ని చూపుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వారం గ్యాప్‌తో రెండు భారీ సినిమాలు రిలీజ్ కావడం కూడా బాక్సాఫీస్ ని ప్రభావితం చేస్తుందని, ఈ విషయంలో ఇరు సినిమాల మేకర్స్ ఆలోచించుకుంటే మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు.