వీరమల్లు సీక్వెల్ టైటిల్ రివీల్.. అసలైన యుద్ధం అప్పుడే..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. అనేక చోట్ల జులై 23వ తేదీన రాత్రి పెద్ద ఎత్తున ప్రీమియర్ షోస్ తో సందడి చేసింది. మరికొన్ని చోట్ల నేడు ఉదయం రిలీజ్ అయింది.
దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్ పై ఉండిపోయిన వీరమల్లు.. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా కనిపించారు. సత్యరాజ్, విక్రమ్ జీత్, అయ్యప్ప పి.శర్మ, నర్గీస్ ఫక్రీ, దలిప్ తాహిల్ కీలక పాత్రలు పోషించారు.
క్రిష్, ఏఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పించగా.. ఏ.దయాకరరావు నిర్మించారు. అయితే హరిహర వీరమల్లు రెండు పార్టుల్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. తొలి భాగాన్ని హరి హర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ టైటిల్ తో విడుదల చేశారు.
ఇప్పుడు పార్ట్-1 చివర్లో పార్ట్-2 టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. హరిహర వీరమల్లు పార్ట్ 2- బ్యాటిల్ ఫీల్డ్ తెలుగులో యుద్ధభూమి అంటూ ప్రకటించారు. అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ అంచనాలను పెంచారు. అయితే తొలి భాగం చివర్లో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఢిల్లీ బయలుదేరుతారు.
అప్పుడు వీరమల్లును అడ్డుకోవడానికి ఔరంగజేబు (బాబీ డియోల్ ) సిద్ధమవుతారు. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోవడంతో సినిమా తొలి భాగాన్ని ముగించారు మేకర్స్. ఇప్పుడు సీక్వెల్ లో కోహినూర్ ను దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాటం చేసే సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అయితే సీక్వెల్ టైటిల్ మాత్రం అదిరిపోయిందని కొందరు సినీ ప్రియులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, హరిహర వీరమల్లు పార్ట్ 2 20 నిమిషాల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసినట్లు నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో లీక్ చేశారు. త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరి సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.