వీర‌మ‌ల్లు శ‌ర వేగంగా అంచ‌నాలు మించేలా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` మే 9న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-11 08:26 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` మే 9న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంకా నాలుగు రోజులు డేట్లు ఇవ్వాల్సి ఉండ‌గా ఇంత‌లో పీకే కుమారుడు మార్క్ శంక‌ర్ సింగ‌పూర్లో అగ్ని ప్ర‌మాదానికి గురవ్వ‌డంతో? డేట్లు ఇవ్వ‌డం సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న దానిపై మ‌ళ్లీ నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తో మేకర్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించి రీ-రికార్డింగ్, డబ్బింగ్ , వీఎఫ్ ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్న‌ట్లు తెలిపారు.` చివరి దశ నిర్మాణం అన్ని విధాలుగా పూర్తవుతోంది. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా చెక్కుతున్నారు. సినిమాలో విజువ‌ల్స్, పాట‌లు, ఎలివేష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మించి ఉంటాయ‌న్నారు.

క‌థలో బ‌ల‌మైన ఎమోష‌న్, యాక్ష‌న్ స‌న్నివేశాలు కొత్త అనుభూతిని పంచుతాయ‌న్నారు. ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ ప్రాణం పెట్టి ప‌నిచేస్తున్నాడు. గత ఏడు నెలలుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నారాయ‌న‌. ఎడిటింగ్, విఎఫ్ ఎక్స్ సహా అన్ని విభాగాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌న్నారు. అలాగే సినిమా పాన్ ఇండియాలో వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న‌ట్లు మ‌రోసారి క‌న్ప‌మ్ చేసారు.

దీంతో రిలీజ్ విష‌యంలో సందేహాలు తొల‌గిపోయాయి. ప్ర‌క‌టించిన‌ట్లుగానే మే 9న రిలీజ్ ప‌క్కా అని తేలిపోయింది. అయితే ప‌వ‌న్ పై చిత్రీక‌రించాల్సిన నాలుగు రోజుల షూటింగ్ కి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఆయ‌న సింగ‌పూర్ నుంచి తిరిగి రాగానే డేట్లు ఇచ్చే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News