వీరమల్లు బయ్యర్స్ కు నష్టమెంత? పవన్ స్పందిస్తారా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-20 06:01 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. ఐదేళ్లపాటు సెట్స్ పై ఉండి.. ఎట్టకేలకు రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని, ఆయన యాక్షన్ ను అంతా కొనియాడారు.

పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. అయితే మొదటి షో నుంచి సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయినా.. అనుకున్నట్లు మాత్రం రిజల్ట్ రాలేదు.

దీంతో బయ్యర్స్ కు భారీ నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ, సీడెడ్ ఏరియాలకు సినిమాను కొన్న బయ్యర్లు ఇటీవల హైదరాబాద్ విచ్చేశారు. వైజాగ్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ నుంచి వచ్చిన బయ్యర్లు.. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ను కలిశారు. తమ సమస్యలు, బాధలు చెప్పుకొన్నారు.

వీరమల్లు మూవీతో తమకెంత నష్టాలు వచ్చాయో భరత్ భూషణ్ కు చెప్పినట్లు సమాచారం. ఉత్తరాంధ్రకు రూ.7 కోట్లు, వెస్ట్ గోదావరికి రూ.కోటి, గుంటూరు ఏరియాకు రూ.4 కోట్లు, నెల్లూరుకు రూ.2 కోట్లు, సీడెడ్ ఏరియాకు రూ.9 కోట్లు నష్టం వచ్చిందని వివరించారట. కనీసం జీఎస్టీ ఇన్వాయిస్ లు ఇప్పించాలని కోరారని వినికిడి.

అయితే ఆ తర్వాత భరత్ భూషణ్.. వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నానికి కాల్ చేశారని తెలుస్తోంది. తానేం డబ్బులు ఇవ్వలేనని చెప్పారట. అప్పుడు బయర్లంతా పవన్ కళ్యామ్ తో మాట్లాడి తమను మీట్ అయ్యేలా ప్లాన్ చేయాలని కోరారని సమాచారం.

దీంతో బయర్స్ అంతా తాను ప్రయత్నిస్తానని భరత్ భూషణ్ హామీ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్. అయితే బయ్యర్స్ ఓ సూచన చేశారని వినికిడి. పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించి.. తక్కువ రేట్స్ కు వీరమల్లు బయర్స్ కు ఇస్తే బాగుంటుందని.. అప్పుడు ఆదుకున్నట్లు కూడా అవుతుందని చెప్పారని సమాచారం. దీంతో తన వంతు ప్రయత్నం తాను చేస్తానని భరత్ భూషణ్ బయ్యర్లకు చెప్పగా, వారంతా వెనుతిరిగి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News