హనుమాన్ సీక్వెల్.. అంత త్వరగా పూర్తిచేస్తారా?
హిట్టు వర్మ... హిట్టు సినిమా తీశావ్.. వర్త్ సినిమా అంటూ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.
హిట్టు వర్మ... హిట్టు సినిమా తీశావ్.. వర్త్ సినిమా అంటూ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. తేజ సజ్జ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమాకు ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. పెయిడ్ ప్రీమియర్ షోస్ నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించిందీ మూవీ.
హనుమాన్ సినిమా ప్రారంభంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్- PVCU అని టైటిల్ కార్డు వేశారు మేకర్స్. సినిమా విడుదలకు ముందు కూడా ఆ విషయం చెప్పారు. ఈ యూనివర్స్/ఫ్రాంచైజీలో చాలా మంది సూపర్ హీరోలు ఉంటారని, వరుస సినిమాలు తీస్తానని చెప్పారు. ఇక హనుమాన్ మూవీ ఎండింగ్ లో సీక్వెల్ అనౌన్స్ చేశారు.
హనుమాన్ సీక్వెల్ కు జై హనుమాన్ గా టైటిల్ ఫిక్స్ చేసి.. 2025లో సినిమాను విడుదల చేస్తామని కూడా చెప్పేశారు. హనుమాన్ లో ఓ సామాన్య యువకుడు సూపర్ హీరో ఎలా అయ్యాడు? అనేది కథ. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు వచ్చి ఏం చేశారనేది కథ అని ఎండింగ్ చూస్తే అర్థం అవుతోంది. వచ్చే ఏడాది సీక్వెల్ రిలీజ్ అని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు నెట్టింట కొత్త చర్చ మొదలైంది.
ఇప్పటికే ఈ సీక్వెల్ షూటింగ్ సగానికిపైగా మేకర్స్ పూర్తి చేశారామోనని నెటిజన్లు అనుమానిస్తున్నారు. మరోవైపు, హనుమాన్ సీక్వెల్ షూటింగ్ త్వరగానే పూర్తి చేస్తారని వార్తలు వస్తున్నాయి. సెకెండ్ పార్ట్ లో హనుమంతుడి పాత్రకు ప్రశాంత్ వర్మ.. కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
సీక్వెల్ బడ్జెట్ విషయంలో మేకర్స్ అస్సలు రాజీ పడరట. హనుమాన్ వసూళ్లు బట్టి ఖర్చును నిర్ణయించుకుంటారట. అయితే తక్కువ బడ్జెట్ తోనే హనుమాన్ ను అద్భుతంగా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. భారీ బడ్జెట్ తో తెరెకెక్కిస్తే వేరే లెవెలే అని చెప్పొచ్చు. సూపర్ హీరో యూనివర్స్ లో భాగంగా 12 సినిమాలను తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్ ఇదివరకే ప్రకటించారు.
హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్ విలన్‌గా నటించారు. సూపర్ హీరో కావడం కోసం ఏం చేయడానికైనా తెగించే విలన్‌గా వినయ్ రాయ్ యాక్టింగ్ అభిమానులతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో తేజా సజ్జా సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించింది.