• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హనుమాన్'లో అయోధ్య సీన్‌...

'హనుమాన్'లో అయోధ్య సీన్‌ మిస్‌...!

| సినిమా క్లైమాక్స్ లో ముఖ్యంగా చివరి పది నిమిషాలు హనుమంతుడు వచ్చిన సమయంలో గూస్‌బంప్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By - Tupaki Desk
Update: 2024-02-02 07:55 GMT

సంక్రాంతికి కానుకగా వచ్చిన హనుమాన్‌ సినిమా నాల్గవ వారంలోనూ మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్‌ కి కూడా కచ్చితంగా హనుమాన్‌ సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంను బాక్సాఫీస్ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.


చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్‌ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్‌ సృష్టించింది. ఈ సినిమా కోసం ఇంకా చాలా ప్లాన్‌ చేసుకున్నాం.. కాని కొన్ని వీలు పడక పోవడం తో చేయలేక పోయాం అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


సినిమా క్లైమాక్స్ లో ముఖ్యంగా చివరి పది నిమిషాలు హనుమంతుడు వచ్చిన సమయంలో గూస్‌బంప్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభీషణుడు పిలిచిన సమయంలో హిమాలయాల్లో ధ్యానం లో ఉన్న హనుమాన్‌ అక్కడ నుంచి రావడం, హీరోను కలవడం చూపించారు. ఆ సమయంలోనే అయోధ్య షాట్స్ ని పెట్టాలని అనుకున్నారట.

అయోధ్య రామాలయం వద్ద దీపాలు వెలిగిస్తూ ఉండగా, పై నుంచి ఆంజనేయుడు వెళ్లి ఆ దీపాలు అన్ని కూడా వాటంతట అవే వెలిగే విధంగా ప్లాన్‌ చేశారట. అయితే అనుమతులు ఇతర కారణాల వల్ల అది సాధ్యం కాలేదు అంటూ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ వర్మ తెలియజేశాడు.

ఇటీవల అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. అలాంటి సమయంలో అయోధ్య ని హనుమాన్ సినిమాలో అయిదు నుంచి పది సెకన్లు చూపించిన కూడా మరో లెవల్ అన్నట్లు ఉండేది. కానీ ప్రేక్షకులు దాన్ని మిస్ అయ్యారు. ప్రశాంత్‌ వర్మ త్వరలో జై హనుమాన్‌ మొదలు పెట్టబోతున్నాడు. అందులో అయోధ్య ను చూపిస్తాడేమో చూడాలి.


Tags:    
  • Hanuman 
  • Tejasajja 
  • Prashantvarma 
  • Ayodhya 
  • Moviescene 
  • Moviecollections 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS