• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ ఫౌజీ.. జెట్...

ప్రభాస్ ఫౌజీ.. జెట్ స్పీడ్ లో కిక్కిచ్చే సర్ ప్రైజ్

| ప్రభాస్ అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-08-14 06:54 GMT

ప్రభాస్ అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే "కల్కి 2898 AD" సినిమాతో 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మంచి కిక్ ఇచ్చిన ప్రభాస్ ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక కల్కి చిత్రం త్వరలోనే ఓటీటీ లో విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో "ది రాజా సాబ్" సినిమా చేస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే మరో ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజులో ఈ ప్రాజెక్టు అఫిషియల్ అప్‌డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఆగష్టు 17 జరగనుందని, సెప్టెంబర్ 21 తమిళనాడులో షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వివరాలపై అధికారిక ప్రకటన కోసం ఇంకా వేచి చూడాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, పూజా కార్యక్రమం రోజునే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం "ఫౌజీ" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారం అవుతున్న ఈ సినిమా, ఒక ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని వినిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమ కథను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ నటించనున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించబడనుంది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత వైభవంగా రూపొందించడానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సుదీప్ చట్టర్జీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఇక అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తిగా పీరియడ్ డ్రామా నేపధ్యంలో నడిచే సినిమా కావడంతో, ప్రభాస్ ఈ సినిమాలో కనిపించే విధానం అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతుందని భావిస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ అప్డేట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Tags:    
  • Hanuraghavapudi 
  • Tollywoood 
  • Prabhas 
  • Shooting 
  • Sitaramam 
  • Fauji 
  • Mrunalthakur 
  • Kalki2898AD 
  • Salaar2 
  • Rajasaab 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS