• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఫౌజీ' లీక్స్.. ప్రభాస్...

'ఫౌజీ' లీక్స్.. ప్రభాస్ తో హను ఏం ప్లాన్ చేస్తున్నాడో!

| అయితే అలా షూటింగ్ మొదలు పెట్టారో లేదో ఇలా ఈ సినిమా నుంచి లీకులు బయటకి వస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-26 10:30 GMT

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన మేకర్స్.. ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్ళారు. అయితే అలా షూటింగ్ మొదలు పెట్టారో లేదో ఇలా ఈ సినిమా నుంచి లీకులు బయటకి వస్తున్నాయి.

ప్రభాస్ తో ఒక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేస్తున్నట్లు హను రాఘవపూడి ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇది యుద్ధ నేపథ్యంలో సాగే పీరియడ్ లవ్ & యాక్షన్ డ్రామా అనే టాక్ ఉంది. బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరగనుంది. దీని కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో సెట్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ భారీ జైలు సెట్‌ను కూడా నిర్మించారు. ప్రస్తుతం ఆ సెట్‌లోనే చిత్రీకరణ జరుగుతోంది. అయితే సెట్స్ లోని వింటేజ్ కార్లు, బస్సులకు సంబంధించిన ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. అవి కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రభాస్ సినిమాలకు లీకులు కొత్త కాదు. ఎప్పటికప్పుడు సెట్ ఫొటోలు, ఆన్-లొకేషన్ స్టిల్స్ లీక్ అవుతూనే ఉంటాయి. మరోవైపు మైత్రీ మూవీస్ నిర్మించే ప్రతీ సినిమాకు కూడా ఈ లీకుల బెడద ఎప్పుడూ ఉండేదే. యూనిట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ లీకుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు హను సినిమాలోని కీలక సన్నివేశాలు, ప్రభాస్ లుక్ లాంటివి ఏమీ లీక్ అవ్వలేదు కాబట్టి నిర్మాతలు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ భవిష్యత్ లో లీకుల పర్వం ఇలానే కొనసాగకుండా ఉండాలి అంటే, మేకర్స్ ఆదిలోనే లీక్స్ ను నియంత్రించడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రభాస్, హను రాఘవపూడిల చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కమల్ కణ్ణన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా చేస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో "ది రాజాసాబ్" సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్ లో డార్లింగ్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ 'స్పిరిట్' అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ నెలలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తామని నిర్మాత టీ-సిరీస్ భూషణ్ తెలిపారు. 'ఫౌజీ'తో సమాంతరంగా ఈ మూవీ షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇదే క్రమంలో ప్రభాస్ నుంచి సలార్-2, కల్కి-2 సినిమాలు రానున్నాయి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Rajasaab 
  • Maruthi 
  • Spirit 
  • Sandeepreddyvanga 
  • Fauji 
  • Prabhas 
  • Hanuraghavapudi 
  • Socialmedia 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS