హన్సిక బోల్డ్ వీడియో వెనుక నిజం?
ప్రముఖ మలయాళ నటుడు కృష్ణకుమార్ కుమార్తె, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హన్సిక కృష్ణ ఊహించని వివాదంలో చిక్కుకుంది.;
ప్రముఖ మలయాళ నటుడు కృష్ణకుమార్ కుమార్తె, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హన్సిక కృష్ణ ఊహించని వివాదంలో చిక్కుకుంది. 20 ఏళ్ల వయసులోనే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హన్సికకు సంబంధించి ఓ బోల్డ్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్త ఒక్కసారిగా వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వీడియో అసలు ఆమెదేనా? లేక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో చర్చ జరుగుతోంది.
హన్సిక కృష్ణ నటుడి కుమార్తెగానే కాదు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆమె డ్యాన్స్ వీడియోలు, ట్రావెల్ వ్లాగ్స్ యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాంటి ఇమేజ్ ఉన్న హన్సిక గురించి ఇలాంటి వార్తలు రావడం ఆమె కుటుంబ సభ్యులను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఆ వీడియో క్లిప్స్ హన్సిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందని దీని వెనుక ఆమె ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశం కనిపిస్తోందని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటికే హన్సిక కృష్ణ స్పందించింది.
ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఎవరో కావాలనే సృష్టించిన తప్పుడు ప్రచారమని ఖండించింది. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని డీప్ ఫేక్ ద్వారా తన ముఖాన్ని వేరొకరికి తగిలించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. ఇప్పటికే హన్సిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. హన్సిక సోదరీమణులు అహానా, ఇషాని, దియా కృష్ణలు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో మహిళలను టార్గెట్ చేయడం, వారి క్యారెక్టర్‌ను దెబ్బతీయడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ యువతి గురించి ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం వల్ల ఆమె కెరీర్, మానసిక ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటాయో? ఆలోచించాలని నెటిజన్లను కోరారు. ఓ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి కావడంతోనే ఈ విషయాన్ని ఇంతలా రచ్చ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీల పేరుతో ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేయడం వాటి ద్వారా వ్యూస్ , డబ్బు సంపాదించే ముఠాలు పెరిగిపోయాయి. హన్సిక కృష్ణ విషయంలోనూ అదే జరిగి ఉంటుందని సైబర్ టీమ్ ప్రాథమికంగా భావిస్తోంది. ఆ వీడియో క్వాలిటీ, అందులోని వ్యక్తుల కదలికలను గమనిస్తే అది మార్ఫింగ్ చేసినట్లుగా అనిపిస్తోందని సైబర్ టీమ్ భావిస్తోంది. ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు.