పిక్ టాక్ : అందాల హంసా బ్యాక్‌ టు ఫామ్‌

అనుమానాస్పదం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ హంసా నందిని

Update: 2024-05-22 10:58 GMT

అనుమానాస్పదం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ హంసా నందిని. ఈ అమ్మడు తెలుగు లో హీరోయిన్‌ గా చాలా సినిమాలు చేసినా కూడా ఆశించిన స్థాయిలో హిట్స్ దక్కలేదు. దాంతో మిర్చి, భాయ్‌, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో కీలక పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి జోరు స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఉంటుంది. సినిమాల్లో నటించినా లేకున్నా కూడా ఈమె ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.

ఆ మధ్య రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డ హంసా నందిని తిరిగి పూర్తి ఆరోగ్యంగా మారింది. ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తుంది. క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌ లో భాగంగా హంసా నందిని జుట్టు తొలగించిన విషయం తెల్సిందే.

ఆ మధ్య గుండుతోనే ఫోటో షూట్‌ చేసిన హంసా నందిని తిరిగి నార్మల్‌ ఫోటో షూట్స్ తో సందడి చేస్తుంది. తాజాగా హంసా నందిని జిమ్ లో సందడి చేసింది. జిమ్‌ లో తీసుకున్న ఈ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

క్యాన్సర్‌ ను జయించిన హంసా నందిని గొప్పతనంను అంతా కూడా ప్రశంసిస్తున్నారు. మునుపటి ఉత్సాహంతో సందడి చేస్తున్న హంసా నందిని ముందు ముందు సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మంచి సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News