• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హాయ్ నాన్న'.. ఆ సినిమాతో...

'హాయ్ నాన్న'.. ఆ సినిమాతో పోలికలా?

| తమిళ కామెడీ డ్రామా 'దాదా' సినిమాకు ఇది అన్ అఫీషియల్​ రీమేక్​ అంటూ రూమర్స్​ను స్ర్పెడ్​ చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-10-17 15:30 GMT

నేచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్​ నాన్న' మూవీ నుంచి ఇటీవలే అఫీషియల్​ టీజర్​ రిలీజై ఎమోషనల్​గా తాకింది. సోషల్​ మీడియాలో ట్రెండ్ కూడా అయింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు రీమేక్​ అంటూ ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళితే.. హాయ్ నాన్న టీజర్​ను మెయిన్ క్యారెక్టర్స్​ మధ్య రిలేషన్​షిప్​ను చూపిస్తూ కట్​ చేశారు. నాని -మృణాల్, ఇంటెన్స్​ ఆన్​ స్క్రీన్ కెమిస్ట్రీ, ముద్దు సన్నివేశాలు, అలాగే నాని - కియారా ఖన్నా మధ్య ఫాదర్ అండ్ డాటర్​ ఎమోషనల్​ బాండింగ్ సన్నివేశాలు హైలైట్​గా నిలిచాయి.

అయితే ఈ టీజర్​ రిలీజయ్యాక.. తమిళ మీడియాలోని ఓ వర్గం కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తమిళ కామెడీ డ్రామా 'దాదా' సినిమాకు ఇది అన్ అఫీషియల్​ రీమేక్​ అంటూ రూమర్స్​ను స్ర్పెడ్​ చేస్తోంది. 'హాయ్​ నాన్న' - 'దాదా' పోస్టర్ల మధ్య ఉన్న సిమిలారిటీస్​ను హైలైట్​ చేస్తూ వాటిని సోషల్​ మీడియాలో షేర్ చేస్తోంది.

దీంతో సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లుగా కొడుతున్న ఈ ప్రచారం నిజం కాదని నిరూపించడం ఇప్పుడు హాయ్​ నాన్న మూవీటీమ్​కు ఓ ఛాలెంజ్​ లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు మేకర్స్​​.. ఈ సినిమా తమ సొంత ఒరిజినల్ కథే అనేలా అప్డేట్స్​ను ఇస్తూ వస్తున్నారు. రీమేక్​ అంటూ ఎక్కడా మాట్లాడలేదు.

ఏదేమైనా ఎటువంటి కన్ఫర్​మేషనల్​ లేకుండానే తమిళ మీడియా ఇదంతా చేస్తుందని తెలుస్తోంది! కేవలం రెండు పోస్టరను కంపేర్​ చేసి అవి ఒకేలా ఉండటం వల్ల.. రెండు సినిమాల కథలు ఒకటేనని చెప్పలేం. చూడాలి మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే, లేదంటే మూవీటీమ్​ అయినా స్పందించాలి...

ఈ చిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతమందిస్తున్నారు. సాను జాన్‌ వర్గిస్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 7న సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Tags:    
  • Hainanna 
  • Naturalstarnani 
  • Mrunalthakur 
  • Dadamovie 
  • Tamilcomdeydrama 
  • Shauryu 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS