నేషనల్ అవార్డ్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఘట్టమనేని వారసుడు..?
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఘట్టమనేని రమేష్ వారసుడు జయకృష్ణ తన తొలి సినిమా ప్రయాణం మొదలు పెట్టాడు.;
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఘట్టమనేని రమేష్ వారసుడు జయకృష్ణ తన తొలి సినిమా ప్రయాణం మొదలు పెట్టాడు. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతితో జయకృష్ణ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి రీసెంట్ గా ఒక పోస్టర్ వచ్చింది. తిరుపతి ఏడుకొండల బ్యాక్ డ్రాప్ చూపిస్తూ అజయ్ భూపతి ఈమధ్యనే ఒక కాన్సెప్ట్ పోస్టర్ వదిలాడు. ఐతే అందులో డీటైల్స్ ఏవి ఇవ్వలేదు.
ఇంట్రెస్టింగ్ కథతోనే జయ కృష్ణ..
ఐతే మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ కథతోనే జయ కృష్ణ తొలి సినిమా రాబోతుంది అని తెలుస్తుంది. ఘట్టమనేని ఫ్యామిలీ హీరో తొలి సినిమాకు ఈసారి అజయ్ భూపతి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్.. నేషనల్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ని లాక్ చేశారు. అతనెవరో కాదు జీవీ ప్రకాష్ కుమార్. తమిళ్ లో మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోగా సినిమాలు చేస్తున్న జీవీ ప్రకాష్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం అదరగొట్టేస్తున్నాడు.
అతను చేస్తున్న సినిమాలన్నీ కూడా మ్యూజికల్ గా సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు అజయ్ భూపతి జయకృష్ణ సినిమాకు కూడా అజయ్ జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఇంపాక్ట్ చూపించబోతుంది. ఐతే అజయ్ భూపతి సినిమాల్లో మ్యూజిక్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం లాటి సినిమాకు అజనీష్ తో చాలా మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాడు అజయ్. ఇప్పుడు జయకృష్ణ సినిమాకు జీవీ ప్రకాష్ పర్ఫెక్ట్ అని అతన్ని ఫైనల్ చేశారు.
జీవీ ప్రకాష్ ది బెస్ట్ మ్యూజిక్..
జీవీ ప్రకాష్ తప్పకుండా ఈ సినిమాకు ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక జయకృష్ణ మొదటి సినిమాకే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో అజయ్ భూపతి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి 3వ తరం నటుడిగా అజయ్ భూపతి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ. మరి ఈ యువ హీరో తాత వారసత్వాన్ని.. బాబాయ్ స్టార్ డం ని కొనసాగించేలా చేస్తాడా లేదా అన్నది చూడాలి.
జయకృష్ణ సరసన రషా తడాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఆరెక్స్ 100 తో కమర్షియల్ హిట్ అందుకున్న అజయ్ భూపతి రెండో సినిమా మహా సముద్రంతో ఆశించిన రేంజ్ ఫలితాన్ని అందుకోలేదు. ఇక నెక్స్ట్ మంగళవారం సినిమాతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసినా సరే ఈసారి మరో సాలిడ్ స్టోరీతో ఘట్టమనేని యువ హీరోతో వస్తున్నాడు అజయ్ భూపతి. తప్పకుండా ఈ సినిమాకు ఈ కాస్ట్ అండ్ క్రూ ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుందని అంటున్నారు.