• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విడాకుల తర్వాత ఫస్ట్‌...

విడాకుల తర్వాత ఫస్ట్‌ టైమ్‌ ఒకే స్టేజ్‌పై..!

| జీవీ ప్రకాష్, సైంధవిల యొక్క విడాకుల తర్వాత స్టేజ్ షో వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-12-09 05:11 GMT

ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో అయిన జీవీ ప్రకాష్ తన 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇటీవల ఫుల్‌ స్టాప్ పెట్టిన విషయం తెల్సిందే. గాయని సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాష్ 11 ఏళ్ల తర్వాత ఆమె నుంచి విడి పోయాడు. ఇద్దరి కాంబోలో గతంలో పలు పాటలు వచ్చాయి. ఇద్దరి కాంబినేషన్‌కి మంచి పేరు ఉంది. అందుకే విడాకులు తీసుకున్న వెంటనే ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరిలో ఎవరిది తప్పు అంటూ చర్చ జరిగింది. అయితే ఇద్దరు కలిసి జీవితం సాగించలేం అని నిర్ణయం తీసుకున్నప్పుడు విడిపోవడం ఉత్తమం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు.

సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ చాలా బిజీగా ఉన్నారు. ఆయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతాన్ని అందించడంతో పాటు నటుడిగాను సినిమాలు చేస్తున్నారు. ఇలా బిజీ బిజీగా ఉన్న జీవీ ప్రకాష్ విడాకుల తర్వాత మొదటి సారి సైంధవితో స్టేజ్ షేర్‌ చేసుకున్నారు. ఒక ఈవెంట్‌ కోసం వీరిద్దరు కలిసి ఒకే పాటను స్టేజ్‌పై పాడి చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను మెప్పించారు. వీరిద్దరి కాంబో పాటకు మంచి స్పందన వచ్చింది. వీరిద్దరూ కలిసి పాడుతున్న సమయంలో ఆడిటోరియం మొత్తం పెద్ద శబ్దాలు చేస్తూ అభిమానులు వారిపై తమ ప్రేమను చూపించారు.

జీవీ ప్రకాష్, సైంధవిల యొక్క విడాకుల తర్వాత స్టేజ్ షో వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు నాట భారీ ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్న జీవీ కుమార్‌, సైంధవిల పాటకు మంచి స్పందన రావడంతో వారిద్దరి కాంబోకి ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడిపోయిన తర్వాత కూడా ఇలా కలిసి స్టేజ్ పై కనిపించడం చాలా సంతోషంగా ఉందంటూ కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తే మరి కొందరు మాత్రం వీరిద్దరు విడిపోకుండా ఉంటే బాగుండేది కదా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.

సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్‌ ఇటీవల తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. తమిళనాట ఈయన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాతో పాటు పలు పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఒక వైపు స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ ఏడాదికి నాలుగు అయిదు హిట్స్ అందుకుంటున్న జీవీ ప్రకాష్ నటుడిగా ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. హీరోగా ఈయన నటించిన 15 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి.

Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx

— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024
Tags:    
  • Gvprakashkumar 
  • Saindhavi 
  • Divorce 
  • Musicdirector 
  • Socialmediaviral 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS