లెజెండ‌రీ గురుద‌త్ బ‌యోపిక్‌లో విక్కీ కౌశ‌ల్

జులై 9న గురుదత్ శతజయంతి ఉత్సవాలు జరుగుతుండటంతో, స్టూడియో ఆయన వారసత్వాన్ని గౌరవించడానికి వారం రోజుల నివాళిని సిద్ధం చేస్తోంది.;

Update: 2025-05-30 23:30 GMT
లెజెండ‌రీ గురుద‌త్ బ‌యోపిక్‌లో విక్కీ కౌశ‌ల్

భారతీయ సినిమా దిగ్గజం, లెజెండ‌రీ ఫిలింమేక‌ర్ గురుదత్ 100వ జయంతి వేడుకలకు స‌మ‌య‌మాస‌న్న‌మ‌వుతోంది. ఇంత‌లో హీరో విక్కీ కౌశల్ బయోపిక్ కోసం దిగ్గజ దర్శకుడి బాట‌లో ముందుకు సాగ‌నున్నాడు. గురుదత్ ఫిల్మోగ్ర‌ఫీ హక్కులను కలిగి ఉన్న అల్ట్రా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ ఆయ‌న‌కు నివాళిగా ఈ సినిమాని ప్ర‌క‌టించింది.

యూరి, చావా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో త‌న పాత్ర‌ల‌లో కి అద్భుతంగా ప‌ర‌కాయం చేసిన విక్కీ కౌశ‌ల్ ఈ బ‌యోపిక్ కి న్యాయం చేస్తాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ పాత్ర కోసం అత‌డు మేకోవ‌ర్ చూపించ‌నున్నాడు. ఈ మే నెల‌లో గురుదత్ 100వ జయంతిని పురస్కరించుకుని 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప‌లు గురుదత్ క్లాసిక్‌ల 4కే వెర్షన్‌లను ప్రదర్శించారు - ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌద్విన్ కా చంద్ (1960), సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962) ఇందులో కొన్ని.

జులై 9న గురుదత్ శతజయంతి ఉత్సవాలు జరుగుతుండటంతో, స్టూడియో ఆయన వారసత్వాన్ని గౌరవించడానికి వారం రోజుల నివాళిని సిద్ధం చేస్తోంది. ఈ ప్రత్యేక వేడుకలో భాగంగా రీమోడ‌ల్ చేసిన‌ చిత్రాలను భారతదేశం అంతటా థియేటర్లలో మరోసారి ప్రదర్శించనున్నారు.

Tags:    

Similar News