"అంబాజీపేట మ్యారేజి బ్యాండు".. సౌండ్ షురూ!

ఇక ఇప్పుడు సాంగ్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఫస్ట్ సింగిల్ 'గుమ్మా..' సాంగ్ ను విడుదల చేశారు.

Update: 2023-10-30 16:35 GMT

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తరువాత కలర్ ఫొటోతో హీరోగా మారి న మంచి గుర్తింపును అందుకున్నాడు సుహాస్ ఇక ఆ తర్వాత నుంచి ఆ తర్వాత వచ్చిన రైటర్ పద్మభూషణ్ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇప్పుడు అతను హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" విడుదలకు సిద్ధమవుతోంది. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు.

డిఫరెంట్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా జనవరిలో థియేట్రికల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సాంగ్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఫస్ట్ సింగిల్ 'గుమ్మా..' సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు హ్యాపీగా వర్క్ చేశామని, ఫ్రెష్ సబ్జెక్ట్ చూస్తారని జెన్యూన్ లవ్ స్టోరిగా ఉంటుందని సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడారు. పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు.

డైరెక్టర్ దుశ్యంత్ గుమ్మా సాంగ్ వినగానే అందరికీ నచ్చుతుందని కలర్ ఫొటో ఈ కథకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" రియల్ లైఫ్ లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నానని దర్శకుడు అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ.. హీరోగా కంటే కూడా నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనేది నా డ్రీమ్. ఇందులో మంచి టైమింగ్ ఉన్న పాత్రలో నటించాను. హిట్ 2 సినిమాలో క్యారెక్టర్ కు సైమా అవార్డ్ రావడం హ్యాపీ. హీరోగానే కాదు మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా నటిస్తా. అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని నాకు ఉంది. ఇటీవల కొన్ని పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చాయి గానీ హీరోగా సినిమాలు లైన్ లో ఉండటం వల్ల ఆ సినిమాల్లో నటించలేకపోయాను. అని సుహాస్ అన్నారు.

నిర్మాత ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మా సంస్థ నుంచి వస్తున్న మరో మంచి మూవీ. సినిమా ఔట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. జనవరి ఎండ్ లో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అప్పటికి సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిపోతాయి. సినిమా బాగుంటే ఎప్పుడైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మాకు ఉంది. అల్లు అరవింద్ గారు మా సినిమా చూశారు. చాలా బాగుందని అప్రిషియేట్ చేశారని అన్నారు.

Full View
Tags:    

Similar News