వారసుడి సినీ ఎంట్రీకి సహకరించని స్టార్ హీరో!
ఇదిలా ఉంటే, ఇప్పుడు తన కొడుకు యశ్వర్థన్ అహూజా సినీరంగంలో రాణించేందుకు, అతడి తండ్రి గోవిందా ఎంత మాత్రం సహకరించలేదని అన్నారు సునీత అహూజా.;
బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా, ఆయన భార్య సునీత అహూజా గురించి సోషల్ మీడియాల్లో చాలా ఆసక్తికర డిబేట్ రన్ అవుతుంది. ఆ ఇద్దరిపైనా చెణుకులు వేస్తుంటారు. ఈ జంట నడుమ ఇబ్బందుల గురించి, గోవిందా నటవారసుడి కెరీర్ గురించి కూడా నెటిజనులు ప్రతిసారీ ఆరాలు తీస్తూనే ఉన్నారు.
ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో గోవిందా, తాను ఒకే ఇంట్లో నివశించినా కానీ, వేర్వేరు గదుల్లో నివసిస్తున్నామని, ఎవరి స్వేచ్ఛ కోసం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని సునీత తెలిపారు. అతడు తన పని గురించి, వ్యాపారాల గురించి నిరంతరం స్నేహితులను పిలిచి రాత్రంతా మీటింగులు పెడుతుంటాడని కూడా ఆరోపించింది సునీత అహూజా. అయితే దీనిని మరింత డెప్త్ కి తీసుకెళుతూ కొన్ని మీడియాలో అసలు గోవిందా- అహూజా కలిసి లేరని కూడా కథనాలు అల్లాయి. అయితే ప్రతి చిన్న విషయానికి గోవిందాతో భార్య అహూజా ఘర్షణ పడుతుందని కూడా కొన్ని మీడియాల్లో రాసారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు తన కొడుకు యశ్వర్థన్ అహూజా సినీరంగంలో రాణించేందుకు, అతడి తండ్రి గోవిందా ఎంత మాత్రం సహకరించలేదని అన్నారు సునీత అహూజా. తనయుడిని స్టార్ కిడ్ లా ట్రీట్ చేయడం లేదని కూడా అన్నారు. ఒక ఔట్ సైడర్ లానే 84 ఆడిషన్స్ ఇచ్చాడని చాలా స్ట్రగుల్ అవుతున్నాడని కూడా సునీత అహూజా వెల్లడించారు. బాలీవుడ్‌లో గోవిందాకు ఉన్న స్టార్‌డమ్, పరపతి, కమ్యూనికేషన్ ని తనయుడు ఉపయోగించుకోవడం లేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. యశ్వర్థన్ అహూజా వయసు 28. తండ్రి పేరు చెప్పుకుని అతడు సినీరంగ ప్రవేశం చేయలేదని ఈ వయసు కూడా నిర్ధేశిస్తోంది.