• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య సినిమా.. .ఆలా...

బాలయ్య సినిమా.. .ఆలా జరిగిందా?

| ఇప్పుడు ఆయన సినిమా సంక్రాంతి రిలీజ్ కోసం రూ.5 కోట్ల నష్టాన్ని అంగీకరించారని వార్తలు వస్తున్నాయి!

By - Tupaki Desk
Update: 2024-11-04 16:00 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు NBK 109 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీ.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. అందుకు తగ్గ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ను పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్ లో క్లైమాక్స్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. బాలయ్య కూడా అందుకు పవర్ ఫుల్ గా సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది అయ్యాక బాలయ్య డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారట.

అయితే దీపావళి కానుకగా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని అనుకోగా ఎలాంటి ప్రకటన రాలేదు. సర్కార్ సీతారామ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ రెండో వీక్ లో అఫీషియల్ అనౌన్స్ చేస్తామని నిర్మాత నాగవంశీ రీసెంట్ గా తెలిపారు. ఇప్పుడు ఆయన సినిమా సంక్రాంతి రిలీజ్ కోసం రూ.5 కోట్ల నష్టాన్ని అంగీకరించారని వార్తలు వస్తున్నాయి!

NBK 109 సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఆ తర్వాత క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామనుకున్నారు. కానీ చివరకు సంక్రాంతికి ఫిక్స్ చేశారు. అయితే NBK 109 డిజిటల్ రైట్స్ ను మేకర్స్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ను మేకర్స్ ఇప్పటికే విక్రయించినట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు దసరా నుంచి సంక్రాంతికి సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో నెట్ ఫ్లిక్స్ అనుకున్న అమౌంట్ ను తగ్గించాలని ఒత్తిడి చేసిందట.

దీంతో ఎలా అయినా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన నాగవంశీ.. ఒప్పందం ప్రకారం అనుకున్న డబ్బుల్లో రూ.5 కోట్లు తగ్గించి చెల్లిస్తామన్న నెట్ ఫ్లిక్స్ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    
  • Nandamuribalakrishna 
  • Nbk109 
  • Bobby 
  • Urvashirautela 
  • Sitharaentertainments 
  • Nagavasmi 
  • Rajasthan 
  • Movieshooting 
  • SarkarSeetharam 
  • Netflix 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS