• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ -10 లో మూడు తెలుగు...

టాప్ -10 లో మూడు తెలుగు సినిమాలే!

| ముఖ్యంగా టాలీవుడ్ కు మ‌రింత క‌లిసొచ్చిన ఏడాదిగా చెప్పొచ్చు. 2024 గూగుల్ ట్రెండ్స్ లో అత్య‌ధికంగా శోధిం చిన చిత్రాల్లో టాప్ -10 లో మూడు తెలుగు సినిమాలు ఉండ‌టం విశేషం.

By - Tupaki Desk
Update: 2024-12-11 05:19 GMT

కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్ట‌డానికి అంతా రెడీ అవుతున్నారు. మ‌రి ఈ ఏడాది సినిమాల ప‌రంగా ఎలాంటి రికార్డులు న‌మోద‌య్యాయో? ఓసారి రీకాల్ చేసుకోవాల్సిన అవ‌స‌రం అంతే ఉంది. మునుప‌టి కంటే? ఈ ఏడాది మ‌రిన్ని స‌క్సెస్ లు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద మెరుగైన ఫ‌లితాలు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అన్ని భాష‌ల‌కు ఈ ఏడాది బాగానే క‌లిసొచ్చింది.

ముఖ్యంగా టాలీవుడ్ కు మ‌రింత క‌లిసొచ్చిన ఏడాదిగా చెప్పొచ్చు. 2024 గూగుల్ ట్రెండ్స్ లో అత్య‌ధికంగా శోధిం చిన చిత్రాల్లో టాప్ -10 లో మూడు తెలుగు సినిమాలు ఉండ‌టం విశేషం. వాటిలో రెండు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు చెందినవి. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన `స‌లార్ సీజ్ ఫైర్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 700కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇక రెండ‌వ చిత్రం `క‌ల్కి 2898`. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం 1000 కోట్ల‌కు పైగా వ‌సూ ళ్ల‌ను రాబ‌ట్టింది. భార‌తీయ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచిన చిత్ర‌మిది. ఇక మూడ‌వ చిత్రం ప్ర‌శాంత్ వ‌ర్మ తెరెక్కించిన `హ‌నుమాన్`. తేజ స‌జ్జా హ‌నుమంతుడి పాత్ర‌లో న‌టించిన సినిమా ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచింది. 40 కోట్ల బ‌డ్జెట్ లో తెర‌కెక్కించిన సినిమా 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

టాప్ -10 జాబితాలో క‌ల్కి 2898 రెండ‌వ స్థానంలో, హ‌నుమాన్ ఐద‌వ స్థానంలో ఉండ‌గా, తొమ్మిద‌వ స్థానంలో `స‌లార్` నిలిచింది. ఇక మొద‌టి స్థానాన్ని శ్ర‌ద్దా క‌పూర్, రాజ్ కుమార్ రావు న‌టించిన `స్త్రీ-2` కైవ‌సం చేసుకుంది.

`12th ఫెయిల్` మూడ‌వ స్థానంలో, `లాపతా లేడీస్` నాల్గ‌వ స్థానంలో, `మ‌హారాజ్` ఆవ‌ర స్థానంలో, ` మంజుమ్మెల్ బాయ్స్` ఏడ‌వ స్థానంలో, `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` ఎనిమిద‌వ స్థానంలో, `ఆవేశం` ప‌ద‌వ స్థానంలో నిలిచాయి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Prabhas 
  • Salaar 
  • Kalki2898AD 
  • Hanuman 
  • Prashanthvarma 
  • Movies 
  • Googletrends2024 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS