రీమిక్స్ గుడ్‌.. ఒరిజినల్‌ బ్యాడ్‌ అగ్లీ

తమిళ్ స్టార్‌ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సినిమా భారీ అంచనాల నడుమ తాజాగా విడుదలైంది.;

Update: 2025-04-11 05:39 GMT

తమిళ్ స్టార్‌ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సినిమా భారీ అంచనాల నడుమ తాజాగా విడుదలైంది. సినిమాకు ఫ్యాన్స్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. రివ్యూలు యావరేజ్ అంటూ వచ్చాయి. అజిత్ ఫ్యాన్స్‌ను అన్ని విధాలుగా సంతృప్తి పరచే విధంగా ఈ సినిమాను దర్శకుడు అధిక రవిచందర్‌ రూపొందించాడు అనడంలో సందేహం లేదు. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించడంతో తెలుగులో భారీ అంచనాల నడుమ విడుదలైంది. తమిళనాట సాధించిన భారీ ఓపెనింగ్స్‌ తెలుగు రాష్ట్రాల్లో రాబట్టలేక పోతుంది. అజిత్ అభిమానులు సినిమా బాధ్యత మొత్తం తమ భుజాన వేసుకున్నారు.

తమిళేతర భాషల్లో మాత్రం సినిమాకు పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. కంటెంట్‌ విషయంలో రెగ్యులర్ ప్రేక్షకులకు నిరుత్సాహం తప్పదు. అభిమానులను మెప్పించడం కోసం అజిత్‌ పాత్రను ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన అధిక్‌ కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయంలోనూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవసారినికి మించి రీమిక్స్‌ పాటలను వినియోగించారు. అంతే కాకుండా బ్యాక్‌ గ్రౌండ్‌ లోనూ ఓల్ట్‌ ట్యూన్స్‌ను వినియోగించారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాకు అందించిన కొత్త సంగీతం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆయన గత చిత్రాలతో పోల్చితే తీవ్రంగా నిరుత్సాహపరిచాడు.

సినిమాలో వచ్చే ఇళయరాజా, విద్యాసాగర్‌ ఇంకా ప్రముఖుల వింటేజ్ పాటలు ఆకట్టుకున్నాయి. వాటిని రీ క్రియేట్‌ చేసినా ఒరిజినాలిటీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. అన్ని విధాలుగా సినిమాకు ఆ పాటలు ప్లస్ అయ్యాయి. రీమిక్స్ పాటలకు గుడ్‌ మార్క్‌లు పడగా, జీవీ ప్రకాష్ అందించిన పాటలకు బ్యాడ్‌, అగ్లీ అంటూ రివ్యూవర్స్ రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమాకు మొదట దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయిన విషయం తెల్సిందే. పుష్ప 2 సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్‌, దేవి శ్రీ ప్రసాద్ మధ్య చిన్న ఇష్యూ జరిగింది. అది వెంటనే క్లీయర్ అయినప్పటికీ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ నుంచి దేవి శ్రీ ప్రసాద్‌ను మైత్రి మూవీ మేకర్స్ వారు తొలగించారనే టాక్‌ వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవడంకు కారణం మైత్రి మూవీ మేకర్స్‌తో విభేదాలు కాదని, దర్శకుడు అధిక్‌ రవిచందర్ మోతాదుకు మించి రీమేక్స్ వాడటం, ఓల్డ్‌ ట్యూన్స్‌ను వినియోగించాలని చెప్పడంతో అది ఇష్టం లేని దేవి శ్రీ ప్రసాద్‌ తప్పుకున్నాడని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రీమిక్స్‌కి, ఓల్డ్‌ ట్యూన్స్ వినియోగంకు దేవి శ్రీ ప్రసాద్‌ ఎప్పుడూ వ్యతిరేకం అనే విషయం తెల్సిందే. తాను సంగీతం అందిస్తున్న ఏ సినిమాలోనూ ఇతర సంగీత దర్శకుల ఓల్డ్‌ ట్యూన్‌ను వినియోగించేందుకు దేవి ఇష్టపడడు. కనుక ఎక్కువ రీమిక్స్‌లు ఉన్న కారణంగానే గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాను వదిలేసి ఉంటాడు. దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం చేసి ఉంటే కచ్చితంగా బాగుండేది అనేది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News