ఇదెక్కడి విడ్డూరం.. బంగారం ధరిస్తే జరిమానా తప్పదా?

అటు 22 క్యారెట్ల బంగారం ధరలలో కూడా మార్పులు భారీగా చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇదే బాటలో వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.;

Update: 2025-10-28 06:20 GMT

బంగారం.. మొన్నటి వరకు ధరలు ఆకాశాన్ని అంటినా.. ఇప్పుడు కార్తీక మాసం.. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి కొంతమేర తగ్గుముఖం పడుతున్నాయి.. మొన్నటి వరకు 1,30,000 వరకు చేరుకున్న 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతూ 1,20,000 కు చేరుకుంటుంది. అటు 22 క్యారెట్ల బంగారం ధరలలో కూడా మార్పులు భారీగా చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇదే బాటలో వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.

తగ్గిన బంగారం, వెండి ధరల విషయానికి వస్తే ..ఈరోజు హైదరాబాదు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గి 1,22,460 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్లపై రూ.750 తగ్గి రూ.1,12,250 కి చేరుకుంది. అటు వెండిపై రూ.5000 తగ్గి ఏకంగా కేజీ సిల్వర్ 1,65 వేలకు చేరుకుంది.

అలా బంగారం ధరలు ఇన్ని రోజులు పెరుగుతూ పోయి ఇప్పుడు సడన్ గా తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.. ముఖ్యంగా ఆ ప్రాంతంలో బంగారం ధరిస్తే జరిమాణ తప్పదట. ఆ జరిమాన ఏకంగా 50,000 అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అసలే ఆడవారికి బంగారం అంటే ఎక్కడలేని ప్రీతి. ఇలాంటి వారికి బంగారం విషయంలో ఇలాంటి రూల్స్ పెట్టడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెళుతువెత్తుతున్నా.. అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

విషయంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో ఉన్న కందద్ , ఇంద్రోలి అనే రెండు గ్రామాలలో మహిళలు బంగారు నగలు ధరించడం పై ఆ ప్రాంతవాసులు విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వారు వివాహాలు, శుభకార్యాల సమయంలో కేవలం మూడు బంగారు నగలు మాత్రమే ధరించాలని గ్రామ పెద్దలు షరతు విధించారు. ఇక్కడ షరతులు ఉల్లంఘిస్తే 50,000 జరిమానా కూడా వేస్తామని హెచ్చరించారు.

అయితే ఇలా చేయడానికి కారణం ఆడంబరాలను అరికట్టడం.. ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ధరించే ఆభరణాలలో చెవిపోగులు, మంగళసూత్రం, ముక్కుపుడక మాత్రమే ధరించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అయితే ఈ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక మహిళలు కూడా స్వాగతించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

అసలే బంగారం అంటే పడి చచ్చే మహిళలు చాలామంది. ఇక ఏదైనా శుభకార్యాలు జరిగాయి అంటే ఒంటినిండా బంగారం ధరించాల్సిందే. అలాంటి సమయంలో కేవలం పుస్తెలతాడు మాత్రమే ధరించాలి అని షరతులు విధించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఈ రూల్ ఏదో చాలా బాగుంది.. ఇలా చేస్తే పేద, ధనిక అనే తేడా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News