క్రేజీ డైరెక్టర్ ఆశలన్నీ అనుష్కపైనే
క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ `ఘాటీ`. అనుష్క ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు.;
క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ `ఘాటీ`. అనుష్క ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. సొంత నిర్మాణ సంస్థలో అత్యంత భారీ స్థాయిలో క్రిష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అనుష్క, క్రిష్‌ల కలయికలో కొన్నేళ్ల క్రితం `వేదం` మూవీ వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది.
ఈ సినిమాతో తమిళ హీరో విక్రమ్ ప్రభు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. రమ్మకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని పూర్తి చేసుకునే పనిలో ఉంది. కొన్ని నెలల క్రితం ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ని విడుదల చేశారు. కొడవలితో అనుష్క పీకలు కోస్తున్న దృష్యాలు, అనుష్క క్యారెక్టరైజేషన్, తన మేకోవర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. రీసెంట్‌గా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ టీమ్ ఓ వీడియోని విడుదల చేసింది.
ఈ వీడియోలో ఈ మూవీని ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నామంటూ ప్రకటించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రోజున `ఘాటీ` రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రిలీజ్ డేట్‌కు మరో ఏడు రోజులే సమయం ఉన్నా ఇంత వరకు టీమ్ నుంచి ఎలాంటి హడావిడి కనిపించకపోవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గంజాయి మాఫియా నేపథ్యంలో ఓ సామాజిక అంశాన్ని జోడించి దర్శకుడు క్రిష్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.
దర్శకుడిగా `హరి హర వీరమల్లు` కోసం ఐదేళ్ల సమయం కేటాయించి చివరికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న క్రిష్ తన ఆశలన్నీ `ఘాటీ`పైనే పెట్టుకున్నారట. ఈ సినిమాతో మళ్లీ బ్లాక్‌బస్టర్‌ని దక్కించుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే గట్టి నమ్మకంతో ఉన్నారట. మరి ఆ నమ్మకాన్ని అనుష్క ఏ స్థాయిలో నిలబెడుతుందో తెలియాలంటే `ఘాటీ` రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.