దీపిక వర్కింగ్ అవర్స్.. జెనీలియా సూపర్ కౌంటర్!
ఇప్పుడు హీరోయిన్ జెనీలియా కూడా రెస్పాండ్ అయింది. తన అప్ కమింగ్ మూవీ సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడింది.;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ గా వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీ టౌన్ లో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన అమ్మడు, వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అనేక సూపర్ హిట్స్ ను సొంతం చేసుకుంది. కల్కి 2898 ఏడీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత స్పిరిట్ లో ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కానీ రీసెంట్ గా దీపికను తప్పించి త్రిప్తీ డ్రిమ్రీని తీసుకున్నారు. రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేయడంతోపాటు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని దీపిక చెప్పడంతో ఆమెను సందీప్ వంగా తప్పించారని ప్రచారం సాగింది.
ఆ తర్వాత స్టోరీని దీపిక అండ్ టీమ్ లీక్ చేసిందని సందీప్ వంగా ఆరోపించారు. అయితే దీపిక 8 గంటల పని విధానం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆ విషయంపై అనేక మంది సెలబ్రిటీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు దీపికకు సపోర్ట్ గా మాట్లాడగా.. మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు హీరోయిన్ జెనీలియా కూడా రెస్పాండ్ అయింది. తన అప్ కమింగ్ మూవీ సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడింది. సెట్ లో ఎక్కువ సేపు పని చేయడం అందరికీ కష్టమేనని అన్న జెనీలియా.. అది అసాధ్యం అయితే కాదు కదా అని చెప్పింది. తాను ఒక్కోసారి 10 గంటలు కూడా పనిచేస్తానని చెప్పుకొచ్చింది.
ఒక్కోసారి మేడమ్.. ఇంకో రెండు గంటలు పని చేస్తారా అని మేకర్స్ అడుగుతుంటారని, అప్పుడు 12 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుందని పేర్కొంది. మన అవసరం ఉంది కాబట్టి మన సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంలో తప్పు లేదని అభిప్రాయపడిన జెనీలియా.. ఇలా చేయడం సరైనదే వ్యాఖ్యానించింది.
అదే సమయంలో ఒక్కోసారి రెండు, మూడు రోజులు కూడా పనిచేయాల్సి వస్తుందని, అది మన ప్రొఫెషన్ అని జెనీలియా చెప్పింది. ఒక అవగాహనతో షూట్ పూర్తిచేయాలని సూచించింది. ప్రస్తుతం జెనీలియా కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. అనేక మంది ఆమె రెస్పాన్స్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపికు జెనీలియా మంచి కౌంటర్ ఇచ్చారని కామెంట్లు పెడుతున్నారు.