గౌతమ్-సితార డాన్సు టీచ‌ర్ ఈవిడేనా?

గౌత‌మ్ -సితార‌లు చిన్న‌ప్పుడే డాన్సు ల‌పై శిక్ష‌ణ తీసుకున్నారు? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.;

Update: 2025-07-09 21:30 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ -న‌మ్ర‌తాశిరోద్క‌ర్ పుత్ర‌ర‌త్నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గౌత‌మ్ -సితార‌ల‌ను అంద‌రికీ సుప‌రిచితులే. గౌత‌మ్ కంటే సితార ఎంతో ఫేమ‌స్ అయింది. ప్ర‌స్తుతం గౌత‌మ్ విదేశాల్లో చ‌దువుకుంటున్నాడు. సితార మాత్రం హైద‌రాబాద్లోనే త‌ల్లిదండ్రుల‌తో ఉంది. మ‌రి వీరిద్ద‌రు సినిమాల్లోకి వచ్చే అవ‌కాశం ఉందా? సితార మాత్రం క‌చ్చితంగా భ‌విష్య‌త్లో సినిమాల్లోకి వ‌స్తుంద‌ని చాలా మంది భావిస్తున్నారు.


డాన్సు...సినిమాలంటే త‌న‌కెంత ఫ్యాష‌న్ అన్న‌ది ఎప్పటిక‌ప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. చిన్న‌ప్పుడు మామ్ ఒడిలో కూర్చునే డాన్సులు చేసింది. ఆ త‌ర్వాత సితార ఫ్యాష‌న్ అంతా యూట్యూబ్ ఛానెల్ ద్వారా బ‌య‌ట ప‌డింది. అటుపై బంగారు అభ‌ర‌ణాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అవ్వ‌డంతో తొలి సంపాద‌నలోకి దిగింది. ఆ సంగ‌తి ప‌క్క‌బెడితే! గౌత‌మ్ -సితార‌లు చిన్న‌ప్పుడే డాన్సు ల‌పై శిక్ష‌ణ తీసుకున్నారు? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అవును గౌత‌మ్ కు డాన్సు టీజ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ అనీ మాస్ట‌ర్ అట‌.

ఈ విష‌యాన్ని అనీ మాష్ట‌ర్ తెలిపారు. గౌత‌మ్ కి తానే డాన్సు నేర్పించాన‌ని..త‌ర్వాత విదేశాల‌కు చ‌దువుల కోసం వెళ్లిపోవ‌డంతో అక్క‌డ గౌత‌మ్ క్లాస్ లు పూర్తి చేసినట్లు తెలిపారు. అదే స‌మ‌యంలో సితార‌ కూడా నేర్చుకుంటాన‌న‌డంతో త‌న‌కి కూడా డాన్సు నేర్పిన‌ట్లు తెలిపారు. సితార మాత్రం చాలా యాక్టివ్ గా ఉం టుంద‌ని.. చ‌లాకీగా అంద‌రితో క‌లిసిపోతుంద‌న్నారు. అలాగే గౌత‌మ్ ..సితార‌ల‌కు డాన్సు నేర్పినంత కాలం త‌న కోసం మ‌హేష్ ఇంటి నుంచి బెంజ్ కారు పంపిచేవారేన్నారు.

ఆ కారు త‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల వారు చూసి త‌న‌ద‌నుకునేవార‌ని..కానీ ఈ కారు నాది కాదు. మ‌హేష్ బాబు గారిదిని అని చెప్పేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. ప్ర‌స్తుతం కొరియోగ్రాఫ‌ర్ గా కెరీర్ బాగానే కొనసాగు తుంద‌న్నారు. ఇంకా మంచి సినిమాలు చేసి కొరియోగ్ర‌ఫ‌ర్ గా మంచి హైట్స్ కి చేరుకోవాల‌న్నారు. అనీ మాష్ట‌ర్ కు టాలీవుడ్ లో కొరియోగ్రాఫ‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News