• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్‌.. నెల్లూరి...

రామ్ చరణ్‌.. నెల్లూరి నెరజాణ..!

| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "గేమ్‌ ఛేంజర్"

By - Tupaki Desk
Update: 2024-07-25 16:22 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "గేమ్‌ ఛేంజర్". ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందిస్తున్నారు. దీనికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజైన 'జరగండి' పాటకు మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో మరో సాంగ్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒకే ఒక్కడు' సినిమాలో పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. వాటిల్లో 'నెల్లూరి నెరజాణ' పాటైతే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్.. తరచుగా మనకు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అయితే అలాంటి పాట ఇప్పుడు 'గేమ్‌ ఛేంజర్' సినిమాలో ఉన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గీత రచయిత కాసర్ల శ్యామ్ వెల్లడించారు.

కాసర్ల శ్యామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'గేమ్‌ ఛేంజర్' చిత్రంలో ఓ పాటకు మంచి సాహిత్యం అందించినట్లుగా చెప్పారు. ఆ సాంగ్ స్క్రీన్ మీద ఎంతో బాగా వచ్చినట్లుగా 'భారతీయుడు 2' సినిమా తర్వాత కలిసినప్పుడు డైరెక్టర్ శంకర్ తనతో చెప్పారని తెలిపారు. అది మరొక 'నెల్లూరి నెరజాణ' అవుతుందనే నమ్మకంతో ఉన్నానని, ఆ పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురు చేస్తున్నాని లిరిసిస్ట్ అన్నారు. ఇది సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్, అంజలీల మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ అని చెప్పుకొచ్చారు. దీనికి థమన్ ఎక్స్ లో స్పందిస్తూ 'ఈ పాట..' అంటూ హార్ట్ సింబల్ ఎమోజీలను పోస్ట్ చేసారు.

దర్శకుడు శంకర్ తన సినిమాల్లో పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తో అద్భుతమైన ట్యూన్స్ రాబట్టుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగా అర్థవంతమైన లిరిక్స్ రాయించుకుంటారు. అంతే అద్భుతంగా తెరపైన ఆవిష్కరిస్తారు. ఇప్పుడు కాసర్ల శ్యామ్ చెప్పినదాన్ని బట్టి చూస్తే 'గేమ్‌ ఛేంజర్' సినిమాలో చరణ్, అంజలీల మీద చిత్రీకరించిన డ్యూయెట్ హైలైట్ గా నిలవబోతోందని అర్థమవుతోంది.

'గేమ్‌ ఛేంజర్' మూవీలో మొత్తం 7 పాటలు ఉన్నట్లుగా థమన్ ఇటీవలే వెల్లడించారు. లీక్ అయిన 'జరగండి' పాటను రిలీజ్ చేశామని, ఇంకో పాటను లీక్ కాక ముందే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆగస్ట్ చివరి నుంచి అప్డేట్లు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టుగా తెలిపారు. 'జరగండి జరగండి' పాటలో హుక్‌ స్టెప్పును ఇంకా విడుదల చేయలేదని, థియేటర్‌లో ఈ సాంగ్ కు డ్యాన్సులు చేస్తారని తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ సినిమాని 2024 క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

Tags:    
  • Ramcharan 
  • Gamecharan 
  • Duetsong 
  • Anjali 
  • Shankar 
  • Tollywood 
  • Kiaraadvani 
  • Gamecharansongs 
  • Gamecharanmovie 
  • Kasarlashyam 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS