గేమ్ ఛేంజర్.. బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉందంటే..

కచ్చితంగా ఈ సినిమా చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Update: 2024-05-05 04:28 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ స్ట్రైట్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి మూవీ ఇదే కావడం విశేషం. దీంతో గేమ్ చేంజర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

రీసెంట్ గా గేమ్ చేజర్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ పాటకి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. శంకర్ ఓవైపు కోలీవుడ్ లో కమల్ హాసన్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో చేస్తోన్న ఇండియన్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తున్నారు. జూన్ నెలలోనే మూవీ రిలీజ్ కానుంది. ఈ లోపే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారంట. తాజాగా చెన్నైలో రెండు రోజులు పాటు జరిగిన గేమ్ చేంజర్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

Read more!

నెక్స్ట్ రాజమండ్రిలో షెడ్యూల్ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ లో ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేయనున్నారంట. దీంతో ఆల్ మోస్ట్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని టాక్ వినిపిస్తోంది. చెన్నై షెడ్యూల్ కి ముందు హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం, ఎయిర్ పోర్ట్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గేమ్ చేంజర్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని చరణ్ RC16పై ఫోకస్ చేయనున్నారంట.

ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోని కియారా అద్వానీ నటిస్తోంది. సౌత్ ఇండియన్ సీనియర్ స్టార్ హీరోయిన్ అంజలి ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఎస్.జె సూర్య ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా విలన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది స్టార్ యాక్టర్స్ మూవీలో ఉండబోతున్నట్లు సమాచారం. శంకర్ కూడా గేమ్ చేంజర్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో దేశ వ్యాప్తంగా గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్ మార్కెట్ ఎంత ఉందనేది గేమ్ చేంజర్ సినిమాతో క్లారిటీ రాబోతోంది. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News