గద్దర్ ఫిల్మ్ అవార్డులపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమంటుందంటే
2014, జూన్ 2 తర్వాత సెన్సార్ అయిన సినిమాల నుంచి డిసెంబర్ 2023 వరకు రిలీజైన అన్ని సినిమాలను లెక్కలోకి తీసుకుని మురళీమోహన్ మరియు జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను వెల్లడించిన;
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను గురువారం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు రిలీజైన సినిమాలకు ఈ అవార్డులను అనౌన్స్ చేశారు. సంవత్సరానికి మూడు చొప్పున బెస్ట్ సినిమాలను అవార్డులకు ఎంపిక చేసి వాటిని ప్రకటించారు. సినీ నటుడు మురళీ మోహన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, దిల్ రాజుకి, తెలంగాణ ఎఫ్‌డిసి చైర్మన్ కు తెలుగు ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ధన్యవాదాలు తెలిపింది.
2014, జూన్ 2 తర్వాత సెన్సార్ అయిన సినిమాల నుంచి డిసెంబర్ 2023 వరకు రిలీజైన అన్ని సినిమాలను లెక్కలోకి తీసుకుని మురళీమోహన్ మరియు జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటూ స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆరు ప్రత్యేక అవార్డులను కూడా వారు అనౌన్స్ చేశారు.
ఈ స్పెషల్ అవార్డుల విభాగంలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు కు నందమూరి బాలకృష్ణను, పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు కోసం మణిరత్నంని, బి.ఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ కోసం సుకుమార్‌ని, నాగి రెడ్డి, చక్రపాణి ఫిల్మ్ అవార్డు కోసం అట్లూరి పూర్ణచంద్రరావుని, కాంతారావు ఫిల్మ్ అవార్డ్ కోసం విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు కోసం యండమూరి వీరేంద్రనాథ్‌ని జ్యూరీ మెంబర్లు ఎంపిక చేయగా, ఆయా అవార్డులకు ఎంపికైనందుకు గానూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారందరికీ అభినందనలను తెలిపింది. దాంతో పాటూ తెలుగు సినిమాలకు వివిధ విభాగాల్లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించడంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తం చేసింది.