స్పెషల్ పిక్.. పక్కపక్కనే రేవంత్, బన్నీ, బాలయ్య!
గద్దర్ అవార్డుల వేడుక హైటెక్స్ లో శనివారం గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవార్డుల వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది.;
గద్దర్ అవార్డుల వేడుక హైటెక్స్ లో శనివారం గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవార్డుల వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. 2014-2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 ఏడాదిగాను అన్ని విభాగాలకు పురస్కారాలు అందించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరలవుతున్నాయి.
అదే సమయంలో కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైటెక్స్ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటికే అక్కడ ఉన్న నందమూరి బాలకృష్ణను ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వద్దకు వెళ్లారు.
బన్నీని నవ్వుతూ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి ఒక పక్కన బాలకృష్ణ, మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూర్చున్నారు. అదే సమయంలో మరో పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రేవంత్ పక్కన బాలయ్య ఉండగా.. ఆయన పక్కనే అల్లు అర్జున్ కూడా కూర్చున్నారు.
దీంతో ఆ ఫోటో వైరల్ గా మారగా.. పిక్ ఆఫ్ ది డే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిక్ అదిరిపోయిందని అంటున్నారు. అయితే కొంతకాలం క్రితం సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి మధ్య రిలేషన్ సరిగ్గా లేదని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రేవంత్ హగ్ చేసుకుని వాటిని ఖండించారు.
కాగా, అల్లు అర్జున్.. పుష్ప-2 మూవీకి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. వేరే లెవెల్ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. బాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఆ మూవీకి అందుకున్న తొలి అవార్డు ఇదేనని బన్నీ తెలిపారు.
మరోవైపు, బాలయ్య.. తన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు పేరు మీద తెలంగాణ సర్కార్ అందించిన ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. అదే సమయంలో ఆయన ఇప్పటికే నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు కూడా అవార్డు వరించింది. 2021 సంవత్సరానికి గాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఆ సినిమా నిలిచింది.