• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వక్ గామి.. జాహ్నవి...

విశ్వక్ గామి.. జాహ్నవి ఎవరు?

| టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీ గామి ఒకటి

By - Tupaki Desk
Update: 2024-02-22 15:24 GMT

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీ గామి ఒకటి. నాలుగేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా.. శివరాత్రి కానుకగా రిలీజ్ కానుంది. మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోర పాత్రలో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న ఈ చిత్రం.. మార్చి 8వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. గామిపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ గ్లింప్స్.. బజ్ మరింత పెంచేసింది. ఈ అడ్వెంచర్ థ్రిల్లింగ్ డ్రామా థియేట్రికల్ ట్రైలర్ ను మరో వారంలో ఫిబ్రవరి 29న తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్.. ప్రమోషన్ల స్పీడ్ పెంచారు.

తాజాగా ఈ మూవీలో లీడ్ రోల్ లో నటిస్తున్న హీరోయిన్ చాందినీ చౌదరి ఫస్ట్ లుక్ ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. చాందిని కళ్లజోడు పెట్టుకుని పెక్యులర్‌ గా ఉన్న ఫస్ట్‌ లుక్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే పోస్టర్ లో చాందిని వీధుల్లో నడుచుకుని వెళ్తున్నట్టు గా చూపించారు. చాందినిని జాహ్నవిగా పరిచయం చేశారు. విశ్వక్ తోపాటు ఆమె చేసిన సాహస యాత్ర సినిమాలో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విద్యాధర్ చాలా కష్టపడ్డారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. వి సెల్యులూయిడ్ సమర్పిస్తోంది. అయితే ఈ మూవీకి క్రౌడ్ ఫండింగ్ చేశారు. వారణాసి, కుంభమేళాలో షూటింగ్ నిర్వహించారు. హారిక పేడాడ, మహ్మద్ సమత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమారన్ మ్యూజిక్ అందించారు. ప్రత్యూష్ వత్యం స్క్రీన్‌ప్లే బాధ్యతలను నిర్వర్తించారు.

అయితే ఇటీవల రిలీజైన గ్లింప్స్ లో గామి వరల్డ్ లోని క్యారెక్టర్లను పరిచయం చేశారు మేకర్స్. అందులో ఒక మ్యాప్‌ ను కూడా హైలైట్ చేశారు. దాని బట్టే కథ నడుస్తుందని అర్థం అవుతోంది. అఘోర అయిన హీరో విశ్వక్ సేన్ ఏం సాధించబోతున్నారనేది ఈ చిత్ర నేపథ్యమని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో విభిన్న ప్రయోగాలు చేసే విశ్వక్ సేన్.. అఘోర పాత్రలో ఎలా ఆకట్టుకుంటారో తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

Tags:    
  • Gaami 
  • Vishwaksen 
  • Filmindustry 
  • Gaamijahnavi 
  • Chandhinichowdary 
  • Tollywood 
  • Gaamimovie 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS