చియాన్ విక్రమ్.. మరో రిస్క్ తీసుకుంటున్నాడా?
ఈ మధ్య తంగలాన్, వీర ధీర శూరన్ లాంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను పలకరించినా అవేమి బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేసింది లేదు.;
అపరిచితుడు, శివపుత్రుడు.. ఈ పేర్లు వినగానే తెలుగు ఆడియెన్స్‌కు గుర్తొచ్చేది చియాన్ విక్రమ్. క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టే నటుల్లో ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఆ డెడికేషన్, ఆ మేకోవర్స్ ఇండియాలోనే చాలా తక్కువ మంది హీరోలు చేస్తూంటారు. అందుకే, విక్రమ్ సినిమా వస్తుందంటే, అది రొటీన్‌గా ఉండదని, ఏదో ఒక కొత్త పాయింట్‌తో వస్తుందని జనాలు నమ్ముతారు.
కానీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టే రేంజ్ సక్సెస్ విక్రమ్ చూసి చాలా కాలమైంది. ముఖ్యంగా అపరిచితుడు తర్వాత, తెలుగులో ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ను మళ్లీ రీ క్రియేట్ చేయలేకపోయారు. మధ్యలో ఐ, కోబ్రా, మహాన్ లాంటి ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఆ ల్యాండ్‌మార్క్ హిట్ మాత్రం పడలేదు. పొన్నియిన్ సెల్వన్ పెద్ద హిట్ అయినా, అది మణిరత్నం మార్క్ మల్టీ స్టారర్ గా నిలిచింది. సోలోగా విక్రమ్ విశ్వరూపం చూసి చాలా ఏళ్లయింది.
ఈ మధ్య తంగలాన్, వీర ధీర శూరన్ లాంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను పలకరించినా అవేమి బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేసింది లేదు. ఇక ఆడియెన్స్ అతని నుంచి కోరుకుంటున్న ల్యాండ్ మార్క్ సినిమా అయితే ఇంతవరకు సెట్ కాలేదు. సాధారణంగా ఇలాంటి టైమ్‌లో, ఒక స్టార్ హీరో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే, పేరున్న పెద్ద డైరెక్టర్‌తో, ఒక సేఫ్ ప్రాజెక్ట్‌తో వస్తాడు. కానీ, విక్రమ్ అలా ఆలోచించడం లేదు. ఆశ్చర్యకరంగా, చియాన్ 63 కోసం విక్రమ్ ఒక కొత్త డైరెక్టర్‌ను నమ్ముకున్నాడు.
చాలా కాలం తర్వాత, విక్రమ్ ఒక డెబ్యూ డైరెక్టర్‌తో సినిమా చేస్తుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్. ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు? అంటే, ఒకే ఒక్క సమాధానం వినిపిస్తోంది.. ఆ కొత్త డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ విక్రమ్‌కు అంత బాగా నచ్చిందట. ఈ ఒక్క మూవ్ చాలు విక్రమ్ మెంటాలిటీ అర్థం చేసుకోవడానికి. ఆయనకు కావాల్సింది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాదు, ఒక సాలిడ్ స్క్రిప్ట్. ఆయనకు కావాల్సింది సేఫ్ గేమ్ కాదు, నటుడిగా ఛాలెంజ్ చేసే ఒక కొత్త రోల్.
శివపుత్రుడు టైమ్‌లో ఆయన ఆకలి ఎలా ఉండేదో, ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఆయన ఆకలి తగ్గలేదని అర్ధమవుతుంది. ఈ రిస్క్ వర్కవుట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ, విక్రమ్ మాత్రం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం ఆపడం లేదు. ఆ డెబ్యూ డైరెక్టర్ కనుక ఆ స్క్రిప్ట్‌ను పర్ఫెక్ట్‌గా డీల్ చేస్తే, తెలుగు ఆడియెన్స్ ఎప్పటినుంచో మిస్ అవుతున్న ఆ పాత అపరిచితుడుని మళ్లీ చూడొచ్చు.