• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీనాక్షి చౌదరి.....

మీనాక్షి చౌదరి.. ఎట్టకేలకు ఒక పెద్ద హిట్..

| ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ లో తెలుగు సినీ ప్రియులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు.

By - Tupaki Desk
Update: 2024-10-31 14:30 GMT

హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఈ హర్యానా బ్యూటీ యంగ్ హీరో సుశాంత్ ఇచ్చట వాహనములు నిలపరాదు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అవుట్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. అప్ స్టార్స్ట్ మూవీతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ లో తెలుగు సినీ ప్రియులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. తన అందం, అభినయంతో మెప్పించారు.

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు మీనాక్షీ చౌదరి. ఖిలాడీ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. అదే ఏడాది అడివి శేష్ తో హిట్- ది సెకండ్ కేస్ మూవీలో నటించి మెప్పించారు. తన కెరీర్ లో తొలి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కొలై సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2024 ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా నటించారు. పెద్దగా స్కోప్ లేని రోల్ లో కనిపించినా.. తన యాక్టింగ్ తో మెప్పించారు. రీసెంట్ గా విజయ్ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో నటించారు. కానీ సాంగ్స్, మూడు సీన్స్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. వరుస ప్రాజెక్టుల్లో మీనాక్షి నటిస్తున్నారు.

దీపావళి కానుకగా లక్కీ భాస్కర్ చిత్రంతో ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించారు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఆ మూవీ ప్రీమియర్స్ షోస్ నిన్ననే పడ్డాయి. సినిమా అదిరిపోయిందని అంతా రివ్యూస్ ఇస్తున్నారు. చాలా బాగుందని చెబుతున్నారు. మీనాక్షి యాక్టింగ్ సూపర్ అని కొనియాడుతున్నారు. అదే సమయంలో ఎట్టకేలకు మీనాక్షి చౌదరి మంచి హిట్ అందుకున్నారని నెటిజన్లు అంటున్నారు.

వాస్తవానికి అది నిజమే.. హిట్-2 తర్వాత మీనాక్షి ఇప్పుడే సరైన హిట్ ను దక్కించుకున్నారు. అదే సమయంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన పాన్ ఇండియా మూవీ మట్కాలో యాక్ట్ చేస్తున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. అది నిజం కాదని రీసెంట్ గా మీనాక్షి క్లారిటీ ఇచ్చారు. మరి ముద్దుగుమ్మ.. ఫ్యూచర్ లో ఇంకెన్ని హిట్స్ అందుకుంటారో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Raviteja 
  • HIT 
  • Adivisesh 
  • THEGOAT 
  • VijayThalapathy 
  • Luckybaskhar 
  • Meenakshichaudhary 

Similar News

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

Copyright @2026

Powered by Blink CMS