ఎట్టకేలకు ఫరియా ఫిక్స్ చేసిందా?
అయితే తాజాగా ఇప్పుడు ఫరియా ఇన్‌స్టాగ్రమ్ లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఫరియా ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఓ టీజర్ ను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.;
జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఆఖరిగా మత్తు వదలరా2 లో కనిపించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ తర్వాత ఫరియా నుంచి మరో సినిమా వచ్చింది లేదు.
అయితే తాజాగా ఇప్పుడు ఫరియా ఇన్‌స్టాగ్రమ్ లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఫరియా ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఓ టీజర్ ను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ది టైటిల్ ఈజ్ హిజ్ నేమ్, అతని ఆటకు రెడీ గా ఉండు. మ్యాడ్‌నెస్ స్టార్ట్ కానుందంటూ ఆ పోస్టర్ కింద రాసి ఉంది. MJM మోషన్ పిక్చర్స్, బురా, సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్లు ఆ సినిమాను సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.
అమర్ బురా, జయకాంత్, వేణు సిద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా నటిస్తున్నానని డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ ఆ టీజర్ ను ఆమె షేర్ చేయడం వెనుక ఉద్దేశం అదే అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సంవత్సరం తర్వాత ఫరియా సినిమా ఓకే చేసిందని, ఈ ప్రాజెక్టుతోనే ఫరియా మళ్లీ స్క్రీన్ పైకి రానుందని వారు భావిస్తున్నారు.
ఫరియా షేర్ చేసిన ఆ టీజర్ డార్క్ కామెడీ మూవీ అని తెలుస్తోంది. ఫరియా పోస్ట్ ఆమె కంబ్యాక్ ను సూచిస్తే, తెలుగు మూవీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ టైమ్ లో ఆమె కూడా ఒక అధ్యాయంలోకి అడుగుపెట్టినట్టే అవుతుంది. మరి ఈ సినిమా అయినా ఫరియాకు మంచి హిట్ ను అందించి, తనను బిజీ ఆర్టిస్టుగా మారుస్తుందేమో చూడాలి.