పిక్‌ టాక్‌ : అల్లరి ఫరియా క్యూట్‌ అందం

ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్స్‌ కంటే ఎక్కువగానే అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.;

Update: 2025-04-14 14:40 GMT

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాస్త ఎక్కువ హైట్ ఉండటం వల్ల ఈమెకు ఆఫర్లు తక్కువ వస్తున్నాయి అనేది కొందరి అభిప్రాయం. హైదరాబాదీ అమ్మాయి అయినా కూడా టాలీవుడ్‌లో ఇతర తెలుగు అమ్మాయిలతో పోల్చితే ఎక్కువ ఆఫర్లు సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ అంతే కాకుండా నటనతో మెప్పించే స్వభావం కారణంగా అడపా దడపా ఆఫర్లను సొంతం చేసుకుంటూనే ఉంది.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్స్‌ కంటే ఎక్కువగానే అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ఈ అమ్మడు అందమైన ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు, చిలిపితనంతో కూడిన ఫోజ్ ఇవ్వడంలో ఫరియా అబ్దుల్లా ఎప్పుడూ ముందు ఉంటుంది అంటారు. అన్నట్లుగానే ఈ అమ్మడు మరోసారి ఈమె తన అల్లరి ఫోజ్‌లతో ఆకట్టుకుంది. సాధారణంగా హీరోయిన్స్‌ కవ్వించే చూపులతో అలరిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్‌ అందంగా కనిపించడంతో పాటు క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ చూపు తిప్పుకోనివ్వదు. తాజా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

 

స్కిన్‌ షో చేయకున్నా స్వచ్చమైన నవ్వుతో, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో, అల్లరి ఫోజ్‌ ఇస్తూ క్యూట్‌గా అందంగా ఫరియా అబ్దుల్లా ఉంది అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలకు కామెంట్‌ చేస్తున్నారు. పాపం ఫరియా ఇంత అందంగా ఉన్నా, నటనతో మెప్పిస్తున్నా కూడా లక్‌ కలిసి రావడం లేదని, అంతే కాకుండా తెలుగు అమ్మాయి కావడం వల్ల ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కెరీర్‌ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసిన ఫరియా అబ్దుల్లా ఈమధ్య కాలంలో కాస్త స్లో అయింది. తిరిగి ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా కచ్చితంగా పాపులారిటీని సొంతం చేసుకుని వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జాతిరత్నాలు సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా నటించి చిట్టి పాత్రలో మెప్పించింది. ఇప్పటికీ చిట్టి అంటూ ఫరియా అబ్దుల్లాను అభిమానులు పిలుస్తూ ఉంటారు. జాతిరత్నాలు సినిమా తర్వాత ఈమె నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బంగార్రాజు సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించిన ఈ అమ్మడు కల్కి సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. మత్తు వదలరా 2 సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక తమిళ సినిమా ఉంది. ఒక తెలుగు సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News