3 రోజుల్లోనే బాక్సాఫీస్‌ రికార్డ్‌లన్నీ బద్దలు

హాలీవుడ్‌ సినిమాలు తీవ్ర సంక్షోభంను ఎదుర్కొంటున్నాయని, థియేట్రికల్‌ రిలీజ్‌లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయనే వార్తలు రెగ్యులర్‌గా వస్తున్నాయి.;

Update: 2025-07-28 13:00 GMT

హాలీవుడ్‌ సినిమాలు తీవ్ర సంక్షోభంను ఎదుర్కొంటున్నాయని, థియేట్రికల్‌ రిలీజ్‌లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయనే వార్తలు రెగ్యులర్‌గా వస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటిలాగే వరల్డ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉన్నాయి. మార్వెల్‌ స్టూడియోస్‌ వారి 'ది ఫెంటాస్టిక్‌ ఫోర్‌ : ఫస్ట్‌ స్టెప్స్‌' సినిమా రికార్డ్‌ బ్రేకింగ్‌ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. గత వారం విడుదలైన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. ఈమధ్య కాలంలో ఏ హాలీవుడ్‌ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను ఈ సినిమా నమోదు చేయడం చూడవచ్చు. రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేస్తున్న ఈ సినిమా అన్ని దేశాల్లోనూ సత్తా చాటుతోంది.

ఇప్పటికే ఉన్న పలు హాలీవుడ్‌ సినిమాలను పక్కకు నెట్టి మరీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధిస్తుంది. అంతర్జాతీయ స్థాయి మీడియా కథనాల అనుసారంగా ఈ సినిమా మొదటి రోజులోనే ఏకంగా 100 మిలియన్‌ డాలర్లను వసూళ్లు సాధించింది. పెద్దగా ప్రమోషన్స్ చేయని దేశాల్లోనూ సినిమాకు మంచి ఓపెనింగ్స్ పడ్డాయని తెలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా ఏకంగా 200 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 220 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యాయి. కొన్ని దేశాల్లో సినిమా ఈ వారంలో విడుదల కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

రాబోయే మూడు నెలల పాటు ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్లుగానే సినిమా అత్యధికంగా వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలోనూ ఈ సినిమా జోరు కనిపిస్తుంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా గత సూపర్‌ హిట్‌ హాలీవుడ్‌ సినిమాల రికార్డ్‌లను బ్రేక్ చేయడం జరిగింది. హాలీవుడ్‌లో వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించి ఈ ఏడాది మేటి సినిమాగా ది ఫెంటాస్టిక్‌ ఫోర్‌ మూవీ నిలిచింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు పెద్దగా వసూళ్లను మేకర్స్ ఆశించలేదట. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 100 మిలియన్‌ డాలర్లు కేవలం ఓవర్సీస్ మార్కెట్‌ నుంచి వచ్చిందని సమాచారం.

ఈ సినిమాను మార్వెల్‌ కామిక్స్ సూపర్‌ హీరో టీమ్‌ ది ఫెంటాస్టిక్‌ ఫోర్‌ ఆధారంగా రూపొందించారు. ఈ అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమాను మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించింది. వాల్‌ డిస్నీ స్టూడియోస్ వారు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌లో రూపొందిన 37వ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాకు జోష్‌ ఫ్రైడ్‌ మాన్‌, ఎరిక్‌ పియర్సన్‌, జెఫ్‌ కప్లాన్‌, ఇయన్‌ స్ప్రింగర్‌ స్క్రీన్‌ ప్లే అందించగా, మాట్ షక్మాన్‌ దర్శకత్వం వహించారు. జూలియా గార్నర్, సారా నైల్స్, మార్క్ గాటిస్, నటాషా లియోన్, పాల్ వాల్టర్ హౌసర్, రాల్ఫ్ ఇనెసన్‌లతో పాటు పెడ్రో పాస్కల్, వెనెస్సా కిర్బీ, ఎబోన్ మోస్-బాచ్రాచ్, జోసెఫ్ క్విన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News