• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నంద‌మూరి థ‌మ‌న్ బాల‌య్య...

నంద‌మూరి థ‌మ‌న్ బాల‌య్య ఫ్యాన్స్ ని నిరుత్సాహ‌ప‌రిచాడా?

| బాల‌య్య‌- థ‌మ‌న్ ఎంత క్లోజ్ అయిపోయారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. థ‌మ‌న్ ఇంటిపేరు నంద‌మూరిగానూ మారిపోయింది.

By - Tupaki Desk
Update: 2025-02-18 07:05 GMT

బాల‌య్య‌- థ‌మ‌న్ ఎంత క్లోజ్ అయిపోయారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. థ‌మ‌న్ ఇంటిపేరు నంద‌మూరిగానూ మారిపోయింది. బాల‌య్య ఏకంగా త‌న త‌మ్ముడు అంటూ సొంతింటి మ‌నిషిలా చూస్తున్నారు. థ‌మ‌న్ కూడ అంతే విధేయ‌త‌తో న‌డుచుకుంటున్నాడు. బాల‌య్య‌కు త‌న‌లో న‌చ్చింది ఆ డౌన్ టూ ఎర్త్ క్వాలిటీనే. అందుకే నా త‌మ్ముడు అంటూ ఎంతో ప్రేమ‌గాను పిలుస్తున్నారు.

ఇక ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన స‌క్సెస్ లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా `సంక్రాంతికి డాకు మ‌హారాజ్` అంటూ మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా కొట్టారు. ఈ సినిమా పాటలు స‌హా బీజీఎమ్ అదిరిపోయింది. ఇక `అఖండ‌2` విష‌యంలో థ‌మ‌న్ దరువు, దంపుడు ఎలా ఉంటుంద‌న్న‌ది ఊహ‌కి కూడా అంద‌ద‌ని..త‌న‌కి కూడా తెలియ‌ద‌ని థ‌మ‌న్ ముందే అభిమానుల్ని హెచ్చ‌రించాడు.

దీంతో నంద‌మూరి అభిమానులంతా పుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఓ విష‌యంలో అదే నంద‌మూరి అభిమానుల్ని థ‌మ‌న్ తీవ్ర నిరుత్సాహానికి గురి చేసాడు. `డాకు మ‌హారాజ్` ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక్ ను ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ చేస్తామ‌న్నారు. దీంతో అభిమానులు ఆ రోజు కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు. క‌ట్ చేస్తే ఆ రోజు రిలీజ్ చేయ‌లేదు. ఆ త‌ర్వాత అదే నెల 13 కి వాయిదా వేసాం అన్నాడు. ఆ తేదీకి కూడా థ‌మ‌న్ ఓఎస్ టీ ని తీసుకురాలేదు.

13 వ‌తేది దాటి ఇప్ప‌టికి ఐదు రోజులు గ‌డిచిపోయింది. ఇప్ప‌టికీ ఆ ట్రాక్ జాడ‌లేదు. ట్రాక్స్ తో పాటు స‌ర్కారురా అనే ప్ర‌త్యేక పాట‌ను రిలీజ్ చేస్తామ‌ని హామీ ఇచ్చాడు. కానీ ఏ హామీ కూడా నిల‌బెట్టు కోలేక పోయాడు. దీంతో నంద‌మూరి అభిమానులంతా తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతున్నారు. అభిమానుల ఉత్కంఠ‌పై ప్ర‌తీసారి థ‌మ‌న్ నీళ్లు జ‌ల్లేస్తున్నాడంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు.

Tags:    
  • Nandamuribalakrishna 
  • Daakumaharaaj 
  • Bobby 
  • OST 
  • Tollywood 
  • Filmindustry 
  • Akhanda 
  • Thaman 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS