మనోజ్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా!
కాగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 స్ట్రీమింగ్ ఎప్పుడని ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్న వారికి ఆ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ ఓ అప్డేట్ ను అందించారు.;
భారతదేశంలో ఎన్నో వెబ్ సిరీస్‌లు పాపులరవగా, అందులో ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చి బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీసుల్లో ఇది కూడా ఒకటి. ఈ రెండు సీజన్లు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన రావడంతో మూడో సీజన్ ను రాజ్ అండ్ డీకే మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
మరీ ముఖ్యంగా సీజన్2 లోసమంత యాక్ట్ చేయడంతో ఈ సీరిస్ ను ఆడియన్స్ చాలా ఎక్కువగా చూశారు. ఇంకా చెప్పాలంటే సీజన్2 వచ్చాక చాలా మంది సీజన్1 చూశారు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 రాబోతుంది. మొన్నామధ్య ప్రైమ్ వీడియో ఫ్యామిలీ మ్యాన్3 కమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 స్ట్రీమింగ్ ఎప్పుడని ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్న వారికి ఆ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ ఓ అప్డేట్ ను అందించారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్3 సిరీస్ పూర్తైందని, అక్టోబర్ ఆఖరి వారంలో కానీ లేదంటే నవంబర్ మొదటి వారంలో కానీ ఫ్యామిలీ మ్యాన్3 స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుందని మనోజ్ కన్ఫర్మ్ చేశారు. అసలు ఫ్యామిలీ మ్యాన్ ను మొదలుపెట్టినప్పుడు అది ఇంత దూరం వెళ్తుందని తమకు తెలియదని, తాను చేసిన వాటిలో ఎక్కువ జనాదరణ పొందిన ప్రాజెక్టుల్లో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఉంటుందని తాను కచ్ఛితంగా చెప్పగలనని ఆయన తెలిపారు.
కిల్లర్ సూప్ లాంటి సూపర్ హిట్ సిరీసుల్లో నటించినప్పటికీ ది ఫ్యామిలీ మ్యాన్ ద్వారా వచ్చిన ఎక్స్‌పీరియెన్స్ నెక్ట్స్ లెవెల్ అని తెలిపారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 అందరి అంచనాలను మించి ఉంటుందని మనోజ్ బాజ్‌పాయ్ నమ్మకం వ్యక్తం చేశారు. మొదటి రెండు సీజన్లను ఇష్టపడినవారు ఇది చూసి ఎక్కడా నిరాశ చెందరని, సీజన్ 2 లో సమంత హైలైట్ అయితే సీజన్3 లో జైదీప్ అహ్లావత్ షోను నడిపిస్తారని, ఆయనెంతో గొప్ప నటుడని, ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు.