సీజ‌న్ 1 సీజ‌న్ 2 కంటే బావుంది అనాలి: రాజ్ అండ్ డీకే

వెబ్ సిరీస్ అనేది లాంగ్ ఫార్మాట్. అందువ‌ల్ల చాలా మంది ద‌ర్శ‌కులు సినిమాల‌తో స‌రిపెట్టుకుని, వెబ్ సిరీస్ ల‌కు దూరంగా ఉన్నారు.;

Update: 2025-11-20 03:05 GMT

వెబ్ సిరీస్ అనేది లాంగ్ ఫార్మాట్. అందువ‌ల్ల చాలా మంది ద‌ర్శ‌కులు సినిమాల‌తో స‌రిపెట్టుకుని, వెబ్ సిరీస్ ల‌కు దూరంగా ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా రాజ్ అండ్ డీకే లాంగ్ ఫార్మాట్ ప‌నికి అల‌వాటు ప‌డ్డామ‌ని తెలిపారు. అంతేకాదు తాము ప‌ని చేస్తున్న ఒక సినిమా, ప్రారంభం కావాల్సిన మ‌రో సినిమాని ఆపేసి వెబ్ సిరీస్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టామ‌ని చెప్పారు.

ఫ్యామిలీమ్యాన్, ఫ్యామిలీమ్యాన్ 2 రెండు సీజ‌న్లు పెద్ద స‌క్సెస్ సాధించాయి. ఆ మ‌ధ్య‌లోనే హార‌ర్ మూవీ స్త్రీ చిత్రానికి కూడా రాజ్ అండ్ డీకే క‌థ అందించారు. అటుపై ఫ‌ర్జీ అనే వెబ్ సిరీస్ ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ర‌క్త్ బ్ర‌హ్మాండ్ కి ప‌ని చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఫ్యామిలీమ్యాన్ 3 వెబ్ సిరీస్ ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ.. చాలా మంది ఫిలింమేక‌ర్స్ లాంగ్ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టలేదు. కాబట్టి మేం లాంగ్ ఫార్మాట్‌లోకి మారినందుకు నిజంగా సంతోషంగా ఉన్నాము. అది చాలా మంచి ఫ‌లితాన్నిచ్చింది. ఇది చాలా న‌చ్చేది... ఎక్కువ‌మందికి చేరుకునేది. బాగా విలేజ్ లు అడ‌వులు వంటి ఇంటీరియర్‌లలో కూడా వెబ్ సిరీస్ లు వెళ్లాయి. చాలా సంవత్సరాల తర్వాత ప్రజల ముఖాలు వెలిగిపోవ‌డం చూసాం. కాబట్టి గర్వపడాల్సిన పని చేశామ‌ని మాకు తెలుసు. మేం చెప్పాల‌నుకున్న క‌థ‌ల‌కు కొత్త కోణం ఇవ్వ‌గ‌లిగామ‌ని కూడా రాజ్ అండ్ డీకే అన్నారు.

త‌న సృజనాత్మక భాగస్వామితో కలిసి ఫ‌ర్జీ, గన్స్ & గులాబ్స్, సిటాడెల్: హనీ బ‌న్ని వంటి ఓటీటీ షోలను రూపొందించిన డికే మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం, వారికి కథతో వారికి బాగా తెలిసిన దానిని అందించడం ఎల్లప్పుడూ ఒక సవాల్‌! అని అన్నారు. ఫ్యామిలీమ్యాన్ 3లో మునుప‌టి ఫ్లేవ‌ర్ మిస్ కాకుండా, ఇప్పుడు కూడా ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం అవ‌స‌రం... అని అన్నారు. మొద‌టి రెండు సీజ‌న్ల కంటే మూడో సీజ‌న్ ఇంకా బాగా వ‌చ్చింది. ప్రతి ఒక్కరూ మూడవ సీజన్ చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇది చాలా కాలంగా వెయిటింగులోనే ఉంది. ఆ నిరీక్షణకు తగిన ఫలితం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్ర‌జ‌లు బాగా ఇష్టపడితే అది నంబర్ వన్ దశగా భావిస్తామ‌ని అన్నారు. సీజ‌న్ 1, సీజ‌న్ 2 కంటే ప్ర‌జ‌లు ఇది బావుంద‌ని అనాలి. ఈసారి సీజ‌న్ లో శ్రీ‌కాంత్ తివారీ (భాజ్ పాయ్) ని నీడ‌లా వెంటాడే రుక్మా పాత్ర ఆక‌ట్టుకుంటుంది. జైదీప్ అహ్లావ‌త్ దీనిలో న‌టించారు. నిమ్ర‌త్ కూడా విల‌న్ ల గ్యాంగ్ లో ఉంటుంది. దర్శన్ కుమార్ పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ మేజర్ సమీర్‌గా తిరిగి వస్తున్నాడు.

`ది ఫ్యామిలీ మ్యాన్ - 3`లో షరీబ్ హష్మి, ప్రియమణి, ఆశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయ ధన్వంతరి, గుల్ పనాగ్ త‌దిత‌రులు కూడా నటిస్తున్నారు.

Tags:    

Similar News